పంకజ్ త్రిపాఠి మెడకు అవార్డు ఇవ్వండి, మిర్జాపూర్-2లో యాక్టింగ్ అదిరింది, ఇంటర్నెట్

పంకజ్ త్రిపాఠి..నటుడు.. మిర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా మాత్రం మంచి పేరు గడించారు. అఖాండనంద్ త్రిపాఠి అలియాస్ కాలిన్ భయ్యా.. మిర్జాపూర్‌లో జీవిస్తుంటారు. మిర్జాపూర్ నగరాన్ని ఏలుతోన్న రాజు కాలిన్ భయ్యా.. ప్రతీ ఫ్రేములో కనిపిస్తుంటారు. అయితే అతని డైలాగ్ కన్నా శరీరం కూడా నటిస్తోంది. నోటితో డైలాగ్ వినిపించదు కానీ కంటి చూపు, మెడ, సైగలతో ఆకట్టుకొంటారు. ఇటీవలే మిర్జాపూర్-2 వెబ్ సిరీస్‌లో అతని నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యాక్టింగ్‌కు గానూ అవార్డు ఇవ్వాలని కోరుతున్నారు.

నెటిజన్ల ఫిదా..

నెటిజన్ల ఫిదా..

కాలిన్ భయ్యా హావభావాలకు నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. అతను మాటల కన్నా మెడతోనే నటించేశారని చెబుతున్నారు. అతనికి నెక్ చాలా హెల్ప్ చేసిందని పేర్కొన్నారు. సిరీస్‌లో కొన్ని సీన్లతో ఓ వీడియో కూడా తెగ హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి అందులో గల సీన్స్ కూడా అలానే ఉన్నాయి. ప్రతీ ఒక్కరినీ కట్టి పడేస్తున్నాయి. విమర్శకులను కూడా అట్రాక్ట్ చేస్తున్నాయంటే కాలిన్ భయ్యా.. నటన కాదు కాదు జీవించారని చెప్పాల్సి ఉంటోంది.

ప్రాణాలతోనే కాలిన్ భయ్యా..

ప్రాణాలతోనే కాలిన్ భయ్యా..

మిర్జాపూర్-2 సీజన్‌లో చాలా మంది నటులు చనిపోతారు. స్పెషల్ ఆఫీసర్ మౌర్య, సీఎం, కాలిన్ భయ్యా తండ్రిని కోడలు బీనా చంపేస్తోంది. అయితే మక్బూల్ చంపాడానికి రాగా.. బీనా, పనిమనిషి కలిసి మట్టుబెడతారు. అంతకుముందు బీనా, ఆమెపై వృద్దుడు లైంగికదాడి చేయడంతో ప్రతీకారం తీర్చుకుంటోంది. బీనా లవర్ రాజాను మున్నా చంపేస్తాడు. మక్బూల్ అల్లుడు, తల్లిని.. మున్నా చంపడంతో.. మక్బూల్ తిరుగుబాటు చేస్తాడు. కొత్తగా బీహర్‌లోని సియాన్ కూడా ఎంట్రీ ఇవ్వగా.. అక్కడ ఉండే డాన్.. మత్తు పదార్థాల విక్రయానికి నో చెబుతాడు. అయితే కాల్పుల్లో తన కుమారుడినే కోల్పోతాడు.

జేపీకి చెక్..

జేపీకి చెక్..

సీఎం సోదరుడు జేపీ యాదవ్ మంచి వాడు కాదని చెబుతాడు. అలా చెప్పి సీఎంకు దగ్గరయి.. అతనిని మట్టుబెట్టడంలో జేపీకి హెల్ప్ చేసినట్టు అనిపిస్తోంది. కానీ సీఎం కూతురు మాధురి తెలివిగా.. ముఖ్యమంత్రి పదవీ చేపడుతోంది. సిరీస్‌లో చివరికీ గుడ్డు మిర్జాపూర్ ఓన్ చేసుకోగా.. గోలు సపోర్టుగా ఉంటోంది. కాలిన్ భయ్యాను శరద్ హెల్త్ చేస్తాడు. ఇక బీనా గురించిన నిజం.. పార్ట్-3లో కాలిన్ భయ్యా తెలుసుకోబోతాడు. రివేంజ్ గుడ్డు వర్సెస్ కాలీన్ భయ్యా.. బీనా, మాధురి కూడా ఉంటారు.

ఆదరగొట్టేసిన త్రిపాఠి

సీజన్‌లో పంకజ్ త్రిపాఠి మాత్రం తన నటనతో అదరగొట్టేశాడు. కంటి చూపు, మెడతో ఆకట్టుకున్నాడు. సిరీస్‌లో మాటల కన్నా.. నటిస్తూ ప్రశంసలు పొందారు. అందుకే ఆయన మెడకు అవార్డు ఇవ్వాలని ఇంటర్నెట్ కోరుతోంది. ఒక్కొ నెటిజన్ ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+