వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెమళ్ల సెక్స్‌: ఇవీ నిజాలు.. డార్విన్ ఎప్పుడో చెప్పాడు!

ఆడ నెమళ్లను ఆకట్టుకోవడానికి పురివిప్పి నాట్యం చేసే మగ నెమళ్లు.. ఒక్కసారి అవి తమకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలియగానే వాటి వెనుకభాగంపై వాలిపోతాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజస్థాన్ హైకోర్టు జడ్జి పుణ్యమాని విషయం కాస్త గోవు నుంచి నెమలి మీదకు మళ్లింది. ఆడ నెమళ్లు కేవలం మగ నెమళ్ల కన్నీళ్లను తాగడం ద్వారా గర్భం దాలుస్తాయని ప్రకృతి ధర్మానికి విరుద్దంగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వాడి వేడి చర్చ జరుగుతోంది.

బ్రహ్మచారులుగా ఉండే మగ నెమళ్లను జాతీయపక్షిగా ప్రకటించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించరంటూ కొత్త చర్చకు తావిచ్చారు. దీంతో చాలా మంది నెమళ్ల పునరుత్పత్తి వ్యవస్థపై చిన్నపాటి పరిశోధన కార్యక్రమాన్నే పెట్టుకున్నారు. 'సెక్స్' లేకుండా ప్రాణులు మనగలగడం సాధ్యమేనా? అన్న సంశయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.

<strong>నెమళ్లు 'సెక్స్' చేయవు, అందువల్లే జాతీయ పక్షిని చేశారు: రాజస్థాన్ హైకోర్టు జడ్జి మరో సంచలనం</strong>నెమళ్లు 'సెక్స్' చేయవు, అందువల్లే జాతీయ పక్షిని చేశారు: రాజస్థాన్ హైకోర్టు జడ్జి మరో సంచలనం

మరికొంతమంది నెమళ్ల మధ్య ఇంటర్ కోర్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వ్యాఖ్యలు తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే మగ నెమళ్లకు సంబంధించి ఒకప్పుడు చార్లెస్ డార్విన్ కూడా పరిశోధనలు జరిపినట్లు తెలుస్తోంది.

డార్విన్ పరిశోధన:

డార్విన్ పరిశోధన:

మానవ పరిణామ క్రమ సిద్దాంతాన్ని వివరించిన డార్విన్ మగ నెమళ్ల తోక మాత్రం ఎందుకు పెద్దగా, అంత అందంగా ఉంటుందనే విషయాన్ని చాలారోజుల వరకు కనిపెట్టలేకపోయారట. ఆ తర్వాత ఆయన రాసిన 'సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్' సిద్దాంతంలో దీని గురించి వివరించారు.

'పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ జాతి జంతువైనా, పక్షి అయినా మనుగడ సాగిస్తుంది. ఈ క్రమంలో మనుగడ సాగించలేని జాతులు అంతరించిపోతాయి. అదే క్రమంలో మనుగడ సాగించే జాతుల ఆకృతి, అవయవాలల్లో మార్పు కూడా రావచ్చు' అని వివరించారు.

తోకతోనే ఆకర్షణ:

తోకతోనే ఆకర్షణ:

డార్విన్ 1859లో 'ది ఆరిజన్ ఆఫ్ స్పీసెస్'(జాతుల మూలాలు) అన్న పుస్తకం రాసిన కాలంలో.. నెమళ్ల గురించి మరో అనుమానం ఆయనలో మొదలైంది. సులువుగా గాల్లోకి ఎగరడానికి మగ నెమళ్లకు వాటి పొడవైన తోక అడ్డుపడుతుంది. ఈ తోక కాల క్రమంలో ఎందుకు అంతరించలేకపోతుందన్నది డార్విన్ మదిలో మెదిలిన ప్రశ్న. ఇందుకోసం నెమళ్ల జీవనంపై డార్విన్ మరింత లోతుగా పరిశోధన జరిపారు.

ఇందులో తేలిందేంటంటే.. మగ నెమళ్ల తోకలకు ఆడ నెమళ్లను ఆకర్షించే గుణం ఉంటుందట. తోకల పొడవు, అందం బట్టే ఆడ నెమళ్ల మగ తోడును వెతుక్కుంటాయట. దీన్నిబట్టి డార్విన్ ఏం చెప్పారంటే.. మగ నెమళ్ల తోకలు సెక్స్ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి కాబట్టే.. అవి అంతరించడం లేదని ఆయన తన సిద్దాంతంలో పేర్కొన్నారు.

నెమళ్లు ఇంటర్ కోర్స్ జరుపుతాయి:

నెమళ్లు ఇంటర్ కోర్స్ జరుపుతాయి:

ఆడ నెమళ్లను ఆకట్టుకోవడానికి పురివిప్పి నాట్యం చేసే మగ నెమళ్లు.. ఒక్కసారి అవి తమకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలియగానే వాటి వెనుకభాగంపై వాలిపోతాయి. కోలాకస్‌గా పిలవబడే తమ పురుషావయవంతో మగ నెమళ్లు ఆడ నెమళ్లతో ఇంటర్ కోర్స్ జరుపుతాయి.

ఒక్కసారి ఆడ నెమలితో శారీరకంగా కలిసిన తర్వాత మగ నెమళ్లు మరో కొత్త తోడు కోసం వెతుక్కుంటాయి. తమ పిల్ల నెమళ్లను పెంచడంలో మగ నెమళ్లు తమకు తోడుగా ఉంటాయని ఆడ నెమళ్లు కూడా నమ్మకం పెట్టుకోవు. మగ నెమళ్ల వైఖరి అలా ఉంటుందనేది దీనితో స్పష్టం అవుతోంది.

బెర్నార్డ్ షా ఏం చెప్పారంటే!

బెర్నార్డ్ షా ఏం చెప్పారంటే!

నెమళ్లపై పరిశోధన జరిపిన బెర్నార్డ్ పియర్స్ బ్రెంట్ తాను రాసిన ఓ పుస్తకంలోను ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మగ నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేది కూడా ఆడ నెమళ్లను ఆకర్షించడానికేనని, ఆడ నెమళ్లు తమ రుతు క్రమాన్ని బట్టి ఆ నాట్యానికి స్పందిస్తాయని చెప్పుకొచ్చారు.

English summary
Once female peacock consents, the male peacocks jumps on the female peacock's back, align its sexual organ known as cloacas and have intercourse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X