ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై పోర్న్ క్లిప్స్: షాకైన ప్రయాణికులు
పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌లపై ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రకటనలు రావాల్సిన స్థానంలో మూడు నిమిషాల పాటు అడల్ట్ ఫిల్మ్ ప్లే అయ్యింది.
పాట్నా: బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌లపై ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రకటనలు రావాల్సిన స్థానంలో మూడు నిమిషాల పాటు అడల్ట్ ఫిల్మ్ ప్లే అయ్యింది. దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులాంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సిబ్బంది ఆగ్రహంతో వ్యక్తం చేశారు.
ప్రకటనలు రావాల్సిన స్థానంలో అశ్లీల సన్నివేళాలు ప్రసారం కావడం కలకలం రేపింది. దీంతో వెంటనే రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ సిబ్బంది చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడంతో.. ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు.
అక్కడ ప్రకటనలు ప్రసారం చేసే కాంట్రాక్టు తీసుకున్న దత్తా కమ్యూనికేషన్స్ కు సమాచారం ఇచ్చారు. అసభ్య చిత్రాల ప్రదర్శన ఆపివేయాలని ఆదేశించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన రైల్వే అధికారులు దత్తా కమ్యూనికేషన్స్ పై చర్యలు ప్రారంభించారు. ఆ ఏజెన్సీని బ్లాక్ చేయడంతోపాటు జరిమానా విధించారు.

కాంట్రాక్టును కూడా రద్దు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ అశ్లీల అడల్ట్ వీడియోలు ప్లాట్ ఫాం నెంబర్ 10 వద్ద ఉన్న టీవీల్లో ప్రసారం అయినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైల్వే శాఖ కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications