పీఏ ఖాళీగా ఉన్నాడని బూట్లు తొడిగించుకున్న మాజీ సీఎం, ఆలయం దగ్గర అపచారం, వీడియో వైరల్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేవాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం సిద్దరామయ్య తన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)తో బూట్లు తీయించుకున్నారు. ఆలయంలో నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం పీఏ ఖాళీగా ఉన్నాడని మళ్లీ ఆయనతో బూట్లు తొడిగించుకున్నారు. మాజీ సీఎం బూట్లు వేయించుకుంటున్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది. పక్కనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా ఆ విషయం పట్టించుకోకుండా మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.

దేవాలయం రాజగోపురం

దేవాలయం రాజగోపురం

కర్ణాటకలోని చామరాజనగర తాలుకా నల్లూరు మూళేయల్లి మల్లిగమ్మ దేవాలయం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానికులు, ఆలయం కమిటీ సభ్యులు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించారు. దేవాలయం రాజగోపురం ప్రారంభోత్సవానికి మాజీ సీఎం సిద్దరామయ్య తన అనుచరులతో కలిసి హాజరైనారు.

పీఏ ఖాళీగా ఉన్నాడని !

పీఏ ఖాళీగా ఉన్నాడని !

దేవాలయం రాజగోపుర ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ సీఎం సిద్దరామయ్య ఆలయంలోపలికి వెలుతున్న సమయంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆయన కాళ్లకు ఉన్న బూట్లు తీశాడు. ఆలయంలోకి వెళ్లిన మాజీ సీఎం సిద్దరామయ్య ప్రత్యేక పూజలు చేసి, రాజగోపురం ప్రారంభించిన తరువాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆలయం బయటకు వచ్చారు.

మాజీ సీఎంకు బూట్లు తొడిగిన పీఏ

మాజీ సీఎంకు బూట్లు తొడిగిన పీఏ

దేవాలయం బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆయన పీఏ మళ్లీ బూట్లు తొడిగారు. మాజీ సీఎం సిద్దరామయ్యకు ఆయన పీఏ బూట్లు తొడుగుతున్న సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఏపీ దగ్గర మాజీ సీఎం సిద్దరామయ్య బూట్లు తొడిగించుకుంటున్న సమయంలో పక్కనే మాజీ ఎంపీ ద్రువనారాయణ, శివణ్ణ, ఎమ్మెల్యే పుట్టరంగశెట్టి, మాజీ ఎమ్మెల్యే ఎఆర్, క్రిష్ణమూర్తి తదితరులు ఉన్నారని సమాచారం.

రూ. లక్ష్లల విలువైన వాచ్ గిఫ్ట్ !

రూ. లక్ష్లల విలువైన వాచ్ గిఫ్ట్ !

ఇప్పటికే రూ. లక్షల విలువైన వాచ్ తెలిసిన వారి దగ్గర బహుమతిగా తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం సిద్దరామయ్య ఇప్పుడు పీఏ దగ్గర బూట్లు తొడిగించుకుని మరో వివాదానికి తెర లేపారు. మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య మీద విమర్శలు గుప్పించడానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+