వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే మళ్లీ..: టి ఆప్షన్‌పై నారీమన్‌కు సుప్రీం ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన తొమ్మిది పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ దశలో జోక్యం చేసుకోలేమని, అవసరమైన సమయంలో పిటిషన్ వేసుకోవచ్చునని న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్లు సుముఖత చూపుతున్నారు.

సుప్రీం కోర్టు తీర్పుతో తాము నిరుత్సాహానికి గురి కాలేదని, విభజనను ఆపేందుకు ఎన్నిసార్లైనా పోరాడతామని, రాష్ట్రపతి వద్దకు వెళ్లినప్పడు కూడా మరోసారి పిటిషన్ వేస్తామని చెబుతున్నారు. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసిందే తప్ప డిస్మిస్ చేయలేదని చెబుతున్నారు.

Supreme Court

సుప్రీం కోర్టు తమ పిటిషన్‌లను కొట్టి వేయలేదని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అపరిపక్వదశలో మాత్రమే ఉందని చెప్పిందన్నారు. సుప్రీం కోర్టుకు భయపడే నిన్నటి కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లును పెట్టలేదన్నారు. అవసరమైతే తాము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

కోర్టుకు వెళ్లి డబ్బులు వృథా చేసుకొవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. కుట్రలు చేసి తెలంగాణను అడ్డుకోలేరని సుప్రీం కోర్టు ద్వారా తేలిందన్నారు. బాబు తలకిందులుగా వేళ్లాడినా తెలంగాణ ఆగదన్నారు. తమకు ఎవరితోను అవగాహన కుదుర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు పిటిషన్ దాఖలు చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణం రాజు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది నారీమన్ వాదిస్తుండగా.. తెలంగాణ ఆప్షన్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. నారీమన్ కోర్టులో వాదిస్తూ... 371 డి అమలులో ఉండగా రాష్ట్రాన్ని ఎలా విభజించడం కుదరదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిలిపివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం హడావుడిగా రాజ్యాంగ విభజనకు పూనుకుందన్నారు.

ఆర్టికల్ 3 పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను పార్లమెంటులో పెట్టలేదన్నారు. తెలంగాణకు రీజినల్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పేర్కొందన్నారు. ఆరో ఆప్షన్‌గా సమైక్య రాష్ట్రాన్ని ఉంచాలని సూచించిందన్నారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు.. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఆప్షన్లలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉందా అని ప్రశ్నించారు.

English summary
Supreme Court on Friday questioned senior lawyer Nariman about options of Srikrishna Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X