శుభవార్త: తగ్గిన పెట్రోల్, ఢీజీల్ ధరలు, లీటర్ కు రూ.2లకు పైగా తగ్గింపు
పెట్రోల్, ఢీజీల్ ధరలు తగ్గాయి. తగ్గిన ధరలను సోమవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ పై లీటర్ కు రూ. 2.16, డీజీల్ పై రూ.2.10 తగ్గింది.
న్యూఢిల్లీ:పెట్రోల్, ఢీజీల్ ధరలు తగ్గాయి. తగ్గిన ధరలను సోమవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ పై లీటర్ కు రూ. 2.16, డీజీల్ పై రూ.2.10 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధర తగ్గడంతో పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. పెట్రోల్ , ఢీజీల్ ధరలు, పెట్రోల్ పై రూ.2.16, డీజీల్ పై రూ.2.10 తగ్గించాయి.
అయితే ఈ నెల 1వ, తేదిన పెట్రోల్ పై 2 పైసలు, ఢీజీల్ పై 52 పైసలను పెంచాయి ఆయిల్ కంపెనీలు.దీని కంటే ముందు లీటరు పెట్రోల్ కు రూ.1.39, డీజీల్ కు లీటర్ పై రూ.1.04 పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ ధరలను ఏప్రిల్ 15వ, తేదిన పెంచాయి.
తాజాగా ధరలను తగ్గించడంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ కు రూ. 65.32, గతంలో 68.09 ఉండేది, ఢీజీల్ లీటర్ కు రూ.54.90 చార్జీ చేయనున్నారు.అయితే గతంలో లీటర్ ఢీజీల్ కు రూ.57.35 ఉండేది.












Click it and Unblock the Notifications