పట్టపగ్గాల్లేనట్టే ఇక: పెట్రోల్, డీజిల్‌పై రెండో రోజూ అదే బాదుడు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆరంభమైంది. పాత రోజులను గుర్తుకు తెస్తోంది. గత సంవత్సరం రోజుల తరబడి వరుసగా వాటి ధరలు పెరిగిన సందర్భాలు మళ్లీ ముంచుకొచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. వాహనదారులకు షాక్ ఇచ్చాయి. తొలి రోజు పెంచిన మొత్తాన్నే ఇవ్వాళ కూడా కొనసాగించాయి. దీనితో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువైంది.

మళ్లీ అదే పెంపు..
పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు లీటర్‌పై 80 పైసల మేర పెంచిన విషయం తెలిసిందే. రెండో రోజు కూడా అదే పెంపును కొనసాగించాయి. మళ్లీ లీటర్‌పై 80 పైసలను పెంచాయి. 137 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఇంధన ధరలను పెంచడం వరుసగా ఇది రెండోసారి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ రేట్లు పెరిగడం, రవాణా ఖర్చలు తడిసిమోపెడు కావడం వల్ల పడిన అదనపు భారాన్ని చమురు సంస్థలు వాహనదారులపై మోపాయి.

వివిధ నగరాల్లో ఇలా..
క్రూడాయిల్ రేటు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకడం వల్ల తలెత్తిన అదనపు భారాన్ని చమురు సంస్థలు వాహనదారులపై మోపాయి. పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ. 96.21 పైసల నుంచి రూ.97.01 పైసలకు చేరింది. డీజిల్ రూ.86.67 పైసల నుంచి రూ.88.27 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.67 పైసలు, డీజిల్ రూ.95.85 పైసలుగా నమోదైంది.

వివిధ నగరాల్లో ఇలా..
కోల్‌కతలో పెట్రోల్ రూ.106.34 పైసలు, డీజిల్ రూ.91.42 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.91 పైసలు, డీజిల్ 92.95 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.26 పైసలు, డీజిల్ రూ.86.58 పైసలుగా ఉంటోంది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రేటు రూ.97.50 పైసలు, డీజిల్ 88.72 పైసలకు చేరింది. నోయిడాలో పెట్రోల్ రూ.96.46 పైసలు, డీజిల్ రూ.87.97 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రేటు రూ.96.88 పైసలు, డీజిల్ 88.41 పైసలకు చేరింది.

అక్కడెంత..?
జైపూర్‌లో పెట్రోల్ రూ.108.74 పైసలు, డీజిల్ రూ.92.33 పైసలుగా ఉంటోంది. పాట్నాలో పెట్రోల్ రేటు రూ.107.24 పైసలు, డీజిల్ 92.39 పైసలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోవడం వల్లే చమురు సంస్థలు ఆ భారాన్ని వాహనదారులపై మోపాయి. యుద్ధం ఆరంభమైన 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్‌పైనా పడింది.












Click it and Unblock the Notifications