వీడియో వైరల్ : లోహ విహంగంలో శాంతి కపోతం...విమానంలో హల్చల్ చేసిన ప్రత్యేక అతిథి
అహ్మదాబాద్ : సోషల్ మీడియా విస్తరించడంతో ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా వెంటనే దావనంలా పాకిపోతోంది. ఈ మధ్య విమానాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విమానం లోపల ఏం జరుగుతోందో వాస్తవంగా బయట ప్రపంచానికి తెలియదు.
కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ విమానం గాల్లోకి ఎగరగానే లోపల ఏం జరుగుతోంది, ప్రయాణికుల ప్రవర్తన శైలి ఎలాఉంది అన్నీ బయట ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. క్షణంలో వీడియో తీయడం వెంటనే ట్విటర్ లేదా ఫేస్‌బుక్ లేదా ఇతర సామాజిక సైట్లపై పోస్టు చేస్తుండటంతో అన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. విమానంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు కూడా. తాజాగా గోఎయిర్ విమానంలో కూడా ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

విమానంలో కపోతం..
ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ గోఎయిర్ విమానంలో ఓ పావురం హల్చల్ చేసింది. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లే గోఎయిర్ విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికులు అంతా తమ సీట్లలో కూర్చుని ఉండగా... విమానం టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రత్యేక అతిథి హల్చల్ చేసింది. దీంతో ప్రయాణికులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్స్‌లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
వీడియో తీసేందుకు పోటీ పడిన ప్రయాణికులు
విమానంలో ప్రయాణికులంతా కూర్చుని ఉండగా ఈ కపోతం విమానంలోని వెనకాల భాగం నుంచి కాక్‌పిట్ వైపు చక్కర్లు కొట్టింది. సీట్లకు మధ్యలో నిలబడి ఉన్న ఎయిర్ హాస్టెస్‌లు ఈ పావురం వారి తలపై నుంచి ఎగురుతుండగా కిందకు వంగిపోయారు. కొందరైతే ఈ పావురంను పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక ఎంతో ఆసక్తి కలిగించిన ఈ సీన్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. మరికొందరు విమానం వెనకాల తలుపును తీయాల్సిందిగా సిబ్బందిని కోరారు. వెనకాల తలుపు గుండా పావురం బయటకు వెళుతుందని వెంటనే తలుపులు తీయాల్సిందిగా కోరారు.

సోషల్ మీడియాను చుట్టేస్తున్న వీడియో
30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు పావురం సృష్టించిన స్వీట్ గందరగోళంతో విమానం అరగంట ఆలస్యంగా బయలుదేరిందని పోస్టులోతెలిపాడు. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోను చూసిన నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్‌ను పోస్టు చేశారు. బోరుకొట్టిన పావురం అహ్మదాబాదు జైపూర్ విమానం ఎంచక్కా టికెట్ లేకుండా ఎక్కేసిందని ఒక నెటిజెన్ సరదా కామెంట్ పెట్టాడు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications