Yogi Adityanath : యోగీ లీడర్ షిప్ భేష్-పుట్టినరోజున ప్రధాని మోడీ స్పెషల్ ప్రశంస..

దేశంలోనే జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా బీజేపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. యోగీ నాయకత్వ పటిమనూ ప్రశంసించారు.

ఉత్తర్ ప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఓ ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.. అందులో ఆయనపై ప్రశంసలు కురిపించారు. గత ఆరేళ్లుగా యూపీకి యోగీ గొప్ప నాయకత్వం అందించారని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. ప్రస్తుతం కీలక అంశాల్లో యూపీ ఆగ్రస్ధానంలో ఉందన్నారు. ఆయన దీర్ఘకాలం జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

pm modi birthday greetings to yogi adityanath, lauds his leadership

2017 నుంచి యూపీలో అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా 51 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యూపీలో సంబరాలు మిన్నంటాయి. యూపీలో పటిష్ట నేతగా ఎదిగిన యోగీకి భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలున్నట్లు బీజేపీలోనే ప్రచారం జరుగుతోంది. గతేడాది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తు కోసం బాటలు వేసుకుంటున్న యోగీ ఆదిత్యనాథ్ కు పార్టీలోనూ విశేష ఆదరణ లభిస్తోంది.

గతంలో గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ ప్రధాని పీఠాన్ని నరేంద్రమోడీ అధిరోహించారు. అలాగే యోగీ కూడా భవిష్యత్తులో యూపీ మోడల్ తో ప్రధాని అయ్యే అవకాశాలున్నట్లు బీజేపీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆలోపు యూపీలో బీజేపీని పటిష్టంగా మార్చేందుకు యోగీ కీలకంగా మారారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు ఇక్కడి నుంచి గెల్చుకుంటే యోగీ అవకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+