అర్ద్రరాత్రి మోదీ లైవ్ ఆపరేషన్ - వార్ రూమ్ నుంచి నేరుగా..!!
ఆపరేషన్ సింధూర్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపుల పైన భారత సైన్యం విరుచుకుపడింది. అర్ద్రరాత్రి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా మెరుపు దాడుల కు దిగింది. పాక్ తో పాటుగా పీఓకేలోని టెర్రర్ క్యాంప్స్ పైన జరిగిన దాడుల పై భారత్ పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. పాకిస్తాన్ లోని తొమ్మది ఉగ్రవాద శిబిరాలను భారత్ నేరుగా టార్గెట్ చేసింది. కాగా, ఈ మొత్తం ఆపరేషన్ ను ప్రధాని మోదీ లైవ్ లో పర్యవేక్షించారు. వార్ రూమ్ నుంచి పూర్తి ఆపరేషన్ ను మానిటర్ చేసారు.
ప్రధాని మోదీ ఆపరేషన్
పహల్గాం ఉగ్ర దాడి తరువాత టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. గత పది రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదులను తుది ముట్టించే ఆపరేషన్ కు స్కెచ్ సిద్దం చేసారు. కావాల్సిన అన్ని సన్నాహక చర్యలు తీసుకున్నారు. అర్ద్రరాత్రి ఆపరేషన్ సింధూర్ కు ముహూర్తం ఖరారు చేసారు. సరిగ్గా అర్ద్రరాత్రి 1.44 గంటలకు పాక్ తో పాటుగా పీఓకే లోని టెర్రర్ క్యాంక్స్ పైన భారత వాయు సైన్యం విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పీఓకేలోని అయిదు.. పాక్ లోని నాలుగు శిబిరాల ను నేలమట్టం చేసింది. లష్కరే తోయిబా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అర్ద్రరాత్రి ఈ దాడుల కోసం ప్రధాని కార్యాలయంలోనే ముహూర్తం ఖరారు చేసారు.

మెరుపు దాడులతో
భారత్ మెరుపు దాడులతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే 'జైహింద్' అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు నిర్వహించారు. భారత సైన్యం దాడులను పాకిస్థాన్ సైన్యం నిర్ధారించింది. భారత్ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications