శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: నోట్ల రద్దుపై ప్రధాని మోడీ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నోట్ల రద్దు విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ట్వీట్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధం అని ప్రధాని పేర్కొన్నారు.

గుజరాత్‌లో గెలిస్తే మోడీ మరో సాహసేపేత నిర్ణయం, తెరపైకి బీటీటీ: ఏమిటిది?

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి, గెలిచారని చెప్పారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.

నోట్ల రద్దు ప్రయోజనాలు లఘు చిత్రం ద్వారా

ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలను ఓ లఘు చిత్రం రూపంలో తీసుకొచ్చారు. ఈ వీడియోను ప్రధాని మోడీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకేనని

నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకేనని

నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధాని కార్యాలయం పేర్కొంది. దీంతో బుధవారం నల్లధన వ్యతిరేక దినంగా పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది.

ప్రతిపక్షాల విమర్శలు

ప్రతిపక్షాల విమర్శలు

అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు అనేక కష్టాలు పడ్డారని, అందుకే దేశవ్యాప్తంగా నిరసన దినం నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీనికి కొన్ని పార్టీలు మద్దతిచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP and Congress-led Opposition are likely to lock horns on Wednesday, on the first anniversary of demonetisation. While the ruling party is celebrating November 8 as ‘anti-black money day’, several Opposition parties have decided to observe it as a ‘Black Day.’ Several Union ministers and BJP leaders will be highlighting the “benefits” of demonetisation across the country today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి