మోదీ చెవిలో పువ్వు: పెట్టిందెవరు? దాని ప్రత్యేకత ఏమిటీ?
PM Modi: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జార్ఖండ్. మహారాష్ట్రతో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది ఇక్కడ. ప్రస్తుతం హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. ఆరు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అదే సమయంలో 660 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనుల్లో కొన్నింటిని ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
ఇందులో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి చేరుకున్నారు మోదీ. ఇక్కడి బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రం కావడం వల్ల ఆ సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు అక్కడి బీజేపీ నాయకులు.
ఈ సందర్బంగా ఓ మహిళ.. మోదీ చెవిలో పువ్వు పెట్టారు. దీని పేరు జహ్వా. నేడు జార్ఖండ్‌లో కరమ్ పూజా పండగ. గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఈ పర్వదినం నాడు ఈ జహ్వాను విస్తృతంగా వినియోగిస్తారు. ఇప్పుడు దానితోనే మోదీకి స్వాగతం పలికారామె.
తోడబుట్టిన సోదరుడు జీవితాంతం సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ప్రతి మహిళ కూడా ఈ జహ్వాను బహుమతిగా ఇస్తుంటారు. దాన్ని చెవిలో ధరించడం సంప్రదాయం. ఈ జహ్వా గురించి జంషెడ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రస్తావించారు. దాని గురించి వివరించారు.ఈ సభలో ఆయన దాన్ని చెవిలో పెట్టుకునే కనిపించారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications