ప్రధాని మోడీపై ఠాక్రే సంచలన వ్యాఖ్యలు: ప్రతిపక్షాలు ఒక్కటి, శ్రీదేవి, హీరో అక్షయ్ కుమార్!

ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మోడీ ముక్త్ భారత్ (మోడీ లేని భారత్) కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హిట్లర్ పాలన అందిస్తున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఇలాంటి నరేంద్ర మోడీ వలన భారతదేశానికి చాల నష్టం జరిగే అవకాశం ఉందని రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.

 మోడీ తప్పుడు హామీలు

మోడీ తప్పుడు హామీలు

సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్క్ లో ఉగాది పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

మోడీ లేని భారత్

మోడీ లేని భారత్

2019లో నరేంద్ర మోడీ లేని భారత్ కోసం ప్రతిపక్షాలు అన్ని ఏకం కావాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశం చిన్నాభిన్నం అవుతోందని రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.

మరోసారి స్వాతంత్రం

మరోసారి స్వాతంత్రం

భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందని రాజే ఠాక్రే గుర్తు చేశారు. మళ్లీ ఎమర్జెన్సీ తరువాత 1977లో మరోసారి మనకు స్వాంతత్రం వచ్చిందని రాజ్ ఠాక్రే అన్నారు. అయితే 2019లో మళ్లీ మనం నరేంద్ర మోడీని ఇంటికి పంపించి మూడోసారి స్వాతంత్రం తెచ్చుకోవడానికి సిద్దం కావాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు.

విదేశాల్లో మోడీ విలాసాలు

విదేశాల్లో మోడీ విలాసాలు

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పలు విదేశాలకు వెలుతున్నారని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించారు. అయితే విదేశాలకు వెలుతున్న ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల నుంచి భారత్ కు ఎన్ని పెట్టుబడులు తీసుకు వచ్చారో బహిరంగంగా చెప్పాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

అక్షయ్ కుమార్ భారతీయుడా !

అక్షయ్ కుమార్ భారతీయుడా !

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మీద రాజ్ ఠాక్రే సంచనల వ్యాఖ్యలు చేశారు. అక్షయ్ కుమార్ భారతీయుడు కాదని, ఆయన పాస్ పోర్టులో కెనడియన్ గా ఉందని, వికీపిడియాలో కూడా అక్షయ్ కుమార్ భారత్ లో పుట్టిన కెనడియన్ గా ఉందని రాజ్ ఠాక్రే ఆరోపించారు.

శ్రీదేవికి ఎందుకు ప్రధాన్యత !

శ్రీదేవికి ఎందుకు ప్రధాన్యత !

బహుబాష నటి శ్రీదేవి గొప్ప నటి అని రాజ్ ఠాక్రే అన్నారు. అయితే ఆమె దేశానికి ఏం సేవ చేశారని రాజ్ ఠాక్రే మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. శ్రీదేవికి జాతీయ జెండా కప్పి ప్రభుత్వ లాంచానాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.

నీరవ్ మోడీ కోసం శ్రీదేవి

నీరవ్ మోడీ కోసం శ్రీదేవి

పంజాబ్ నేషల్ బ్యాంక్ కు కుచ్చుటోపి పెట్టి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ వ్యవహారం పక్కదోవపట్టించడానికే శ్రీదేవి అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను తప్పుదోవపట్టించారని రాజ్ ఠాక్రే ఆరోపించారు.

శరద్ పవార్ దెబ్బ !

శరద్ పవార్ దెబ్బ !

నేషన్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) అధినేత శరద్ పవార్ తో శనివారం రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. శరద్ పవార్ తో చాలసమయం రహస్యంగా మాట్లాడిన రాజ్ ఠాక్రే మరుసటి రోజు జరిగిన ర్యాలీలో ప్రధాని నరంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+