Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi Accident: ఢిల్లీ యాక్సిడెంట్‍ కేసులో మరో యువతి.. విచారణలో సంచలన వాస్తవాలు..

జనవరి 1 తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొన్న కారు దాదాపు 20 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. వేకువ జామున ప్రాణం పోయి రోడ్డు మీద నగ్న స్థితిలో బాధితురాలు కనిపించిన ఘటన ఢిల్లీని కుదిపేసింది. అయితే కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పోలీసుల విచారణలో యువతితో పాటు ఆమె స్నేహితురాలు ఉన్నట్లు తేలింది.

స్నేహితురాలు

స్నేహితురాలు

కారు ఢీకొన్న తర్వాత యువతి స్నేహితురాలికి స్వల్ప గాయాలయ్యాయని.. ఆమె భయంతో అక్కడి నుంచి పారిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం పోలీసులు మృతరాలి స్నేహితురాలిని పోలీసులు కలిశారు. మంగళవారం ఆమె వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేశారు.

పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు

మృతురాలితో ఆమె స్నేహితురాలు ఉన్నట్లు సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ప్రమాదం జరగడానికి ముందు ఇద్దరు యువతులు కొంతమంది స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ నుంచి మృతురాలు, ఆమె స్నేహితురాలు స్కూటీపై బయల్దేరారు.

అమిత్ షా

అమిత్ షా

తప్పతాగి యువతిని ఢీకొని 20 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లడంపై ఢిల్లీలో ఆందోళనలు చెలరేగాయి. నిందితులను శిక్షించాలంటూ యువత పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని కోరింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరోరాతో మాట్లాడారు.

నిందితులపై IPC సెక్షన్లు 304, 120B

నిందితులపై IPC సెక్షన్లు 304, 120B

అరెస్టు చేసిన ఐదుగురు నిందితులపై పోలీసులు కఠినమైన IPC సెక్షన్లు 304, 120B కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా వివరించారు. ఆయన లాడ్‌పూర్ గ్రామంలోని కంఝవాలా రోడ్డులో మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. తమ వాహనానికి చిక్కిన మహిళ మృతదేహాన్ని నిందితులు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారని, అది దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని ఆయన చెప్పారు.

బైక్‌తో

తన బైక్‌తో కారును కూడా వెంబడించడంతో పాటు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దహియా చెప్పారు. సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం పడిపోయిందని, ఆ తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు. "ఇది కేవలం ప్రమాదం కాదు" దహియా నొక్కి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+