Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం: 90 స్థానాలకు నేడే పోలింగ్..!

Haryana Assembly election 2024 : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు.

రెండు కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, వారి కోసం 20629 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Polling for 90 seats in Haryana assembly today

కాగా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ.. లాడ్వా నుంచి పోటీచేస్తుండగా.. ప్రతిపక్ష నేత భూపిందర్‌సింగ్‌ హుడా-గర్హి సంప్లాకిలోయి స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఎల్లెనాబాద్‌ నుంచి ఐఎన్ఎల్‌డీ అధినేత అభయ్‌సింగ్‌ చౌతాలా, ఉచనా కలాన్‌లో జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలా, జులానా నుంచి మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్‌ పోటీ చేస్తున్నారు.

2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలు, కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుపొందాయి. అయితే జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, దాదాపు స్వతంత్రులందరూ బీజేపీ సర్కారుకు మద్దతు తెలిపారు. దీంతో వరుసగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ.. ఈసారైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ విస్తత ప్రచారం చేశాయి. అయితే, అక్టోబర్ 8నే ఓటర్ల తీర్పుతో అసలై ఫలితాలు వెలువడనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+