Ramya: ప్రముఖ నటి హఠాన్మరణం..! క్లారిటీ..
ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత దివ్య స్పందన అలియాస్ రమ్య చనిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె గుండెపోటుతో మరణించినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. అయితే ఇది ఎంత వరకు వాస్తమో తెలియరాలేదు. అయితే చాలా మంది ఎక్స్(ట్విట్టర్) ద్వారా సంతాపం తెలుపుతున్నారు. జర్నలిస్టు చిత్రసుబ్రమణ్యం మాత్రం ఇప్పుడే దివ్యస్పందనతో మాట్లాడనని చెప్పారు.
ఆమె బాగానే ఉన్నారని చెప్పారు. ఆమె ప్రశాంతంగా పడుకున్నారని, ఇప్పటి వరకు కాల్ చేశారని వివరించారు. బాధ్యతలేని వ్యక్తులు ఇలాంటి వార్తలు పోస్ట్ చేస్తున్నారని, వారికి సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. " దివ్య స్పందనతో ఇప్పుడే మాట్లాడాను. ఆమె జెనివాలో ఉన్నారు. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పటి వరకు కాల్ చేశారు. బాధ్యతలేని వారు ఇలా ట్వీట్లు చేశారు. వారికి సిగ్గు ఉండాలని" చిత్రసుబ్రమణ్యం అన్నారు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నటి దివ్య స్పందన అలియాస్ రమ్య హఠాన్మరణం పొందారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె గుండెపోటుతో మృతి చెందారని పోస్ట్ చేశారు. దీంతో నిజమే అనుకుని అందరూ RIP అంటూ పోస్టులు పెట్టారు. కాగా రమ్య శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యుడు లోనూ రమ్య హీరోయిన్ గా చేశారు. రమ్య కాంగ్రెస్ లో చేరి ఎంపిగా కూడా గెలుపొందారు.
Wonderful meeting the very talented and genteel lady @divyaspandana for dinner in Geneva. We talked about many things including our love for Bangalore. 💫 pic.twitter.com/1kN5ybEHcD
— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023
నటి రమ్య ఆరోగ్యంగానే ఉన్నారంటూ వన్ ఇండియాకు చెప్పిన ఆమె ప్రొడక్షన్ హౌజ్ మేనేజర్ సునయన#Ramya #DivyaSpandana #Oneindiatelugu pic.twitter.com/u2rDEEDAJm
— oneindiatelugu (@oneindiatelugu) September 6, 2023












Click it and Unblock the Notifications