Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో !

తిరువనంతపురం/కొచ్చి: కేరళకు చెందిన ప్రముఖ మలయాళం నటి అపర్ణా నాయర్ తిరువనంతపురంలోని కరమన ప్రాంతంలోని ఆమె ఇంట్లో గత నెల 31వ తేదీన అనుమానాస్పదంగా శవమై కనిపించారు. అపర్ణా నాయార్ మరణ రహస్యం మిస్టరీగా మారింది. నట అపర్ణా నాయర్ చనిపోయే ముందు రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుమార్తె ఫోటోను షేర్ చేసింది.

వారం రోజుల క్రితం నటి అపర్ణా నాయర్ ఆమె భర్త సంజిత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. భర్త ఫోటోతో పాటు ఇదే నా బలం అని నటి అపర్ణా నాయర్ ఓ క్యాప్షన్ పెట్టింది. అపర్ణా నాయర్ వయసు కేవలం 31 ఏళ్లు మాత్రమే. నటి అపర్ణా నాయర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. ఈ మరణం మలయాళం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Popular Malayalam actress Aparna Nair found dead at home under suspicious circumstances

నటి అపర్ణా నాయక్ ఆగస్టు 31న రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే అపర్ణాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నటి అపర్ణా నాయర్ మృతిపై వివరణ ఇచ్చినట్లు కేరళ పోలీసులు తెలిపారు.

కరమన పోలీసులు నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని కేసు నమోదు చేశారు. నటి అపర్ణా నాయర్ మృతికి గల కారణాలను బయటకు లాగుతున్నామని పోలీసులు అన్నారు. భర్తతో కలిసి దిగిన ఫొటోను నటి అపర్ణా నాయర్ షేర్ చేయడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులకు మొదట్లో ఎలాంటి సందేహం రాలేదు.

అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అపర్ణా నాయర్ మరణం మిస్టరీని పోలీసులు ఇప్పుడు ఛేదించారు. భర్త నటి అపర్ణా నాయర్ మరణానికి కారణమని తెలుస్తోంది. కుటుంబ సమస్యతో నటి అపర్ణా ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి వాపోయారు. నటి అపర్ణా నాయర్ ఆత్మహత్యకు అసలు కారణాన్ని బయటపెట్టారు.

నటి అపర్ణా నాయర్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు అపర్ణా ఆమె తల్లికి వీడియో కాల్ చేసి కుటుంబంలోని సమస్యల గురించి మాట్లాడింది. భర్త మద్యం మత్తులో ఇంటికి వచ్చి తనతో పాటు తన కూతురిని మానసిక వేదనకు గురి చేస్తున్నాడని, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వచ్చేయాలని ఉందని తల్లికి చెప్పిందని పోలీసులు అన్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ అపర్ణా నాయర్ ఏడ్చిందని ఆమె తల్లి పోలీసులకు చెప్పింది. అపర్ణా నాయర్ తల్లి ఫిర్యాదు మేరకు నటి భర్త మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+