Viral Video: సైనా నెహ్వాల్ తో షటిల్ ఆడిన రాష్ట్రపతి ముర్ము..!
నిత్యం తీరిక లేని షెడ్యూల్స్ తో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాసేపు దీన్నుంచి విశ్రాంతి పొందారు. ఎప్పుడో ఆడిన షటిల్ ఆటను గుర్తు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను సంప్రదించి తన నివాసం రాష్ట్రపతి భవన్ కు పిలిపించారు. అక్కడే ఉన్న కోర్టులో కాసేపు ఆమెతో షటిల్ ఆడారు. ఈ దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

#WATCH | President Droupadi Murmu played badminton with ace shuttler Saina Nehwal at the Badminton Court in Rashtrapati Bhavan, Delhi today.
— ANI (@ANI) July 10, 2024
(Video: Rashtrapati Bhavan) pic.twitter.com/sLmFqQSMtk
సైనా నెహ్వాల్ తో బ్యాడ్మింటన్ కోసం రాష్ట్రపతి భవన్ లో ఉన్న షటిల్ కోర్టును ఆఘమేఘాల మీద సిద్ధం చేశారు. దీనిపై రాష్ట్రపతి ముర్ము తన సంప్రదాయ చీరకట్టు వస్త్రధారణకు భిన్నంగా పంజాబీ డ్రెస్ వేసుకుని షటిల్ ఆడారు. సైనా మాత్రం తన స్పోర్ట్స్ వేర్ లోనే ఆమెతో తలపడింది. వయసుతో సంబంధం లేకుండా కోర్టులో రాష్ట్రపతి ముర్ము కదిలిన తీరు అక్కడ ఉన్న అధికారుల్ని ఆశ్చర్య పరిచింది. అలాగే బిజీ షెడ్యూల్ నుంచి రాష్ట్రపతి కూడా కాసేపు ఊరట పొందారు.
భారత్ షటిల్ బ్యాడ్మింటన్ కు హబ్ గా మారడం, కొన్నేళ్లుగా సైనా నెహ్వాల్, పీవీ సింధుతో పాటు పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు అంతర్జాతీయ స్ధాయిలో రాణిస్తున్న నేపథ్యంలో ఇలాంటి మరికొందరికి స్పూర్తినిచ్చేందుకు రాష్ట్రపతి ఇలా బ్యాడ్మింటన్ ఆడినట్లు తెలుస్తోంది. సైనా నెహ్వాల్ వంటి స్టార్ ప్లేయర్ కూడా రాష్ట్రపతి ముర్ముతో ఎలాంటి సంకోచం లేకుండా షటిల్ ఆడటం చూపరుల్ని ఆకర్షిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications