Draupadi Murmu: సీఎం చర్చలు, ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన మాజీ సీఎం చిన్నాన !
లక్నో: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయించామని మాజీ సీఎం చిన్నాన మీడియాకు చెప్పారు. సిట్టింగ్ సీఎం మమ్మల్ని ఆహ్వానించి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మనవి చేశారని, మేము ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని మాజీ సీఎం చిన్నాన స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్తతు ఇప్పించేలా చర్చలు జరిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చిన్నాన శివపాల్ యాదవ్ భేటీ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి శివపాల్ యాదవ్ తో పాటు ఎస్పీ మిత్రపక్షం సోహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం పూర్తి అయిన తరువాత శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మనవి మేరకు మేము రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నామని, ఆమెకే ఓటు వేస్తామని శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో శివపాల్ యాదవ్ ఆయన అన్న కుమారుడు అఖిలేష్ యాదవ్ తో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అఖిలేష్ యాదవ్, ఆయన చిన్నాన శివపాల్ యాదవ్ మద్య తేడాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications