మొన్న పొలంలో .. నేడు ట్రాక్టర్ ఎక్కి ... క్యాంపెయిన్‌లో డ్రీమ్‌గార్ల్ రూటే సపరేటు

మథుర : ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొనందుకు నేతల రకరకాల ప్రచారం నిర్వహిస్తున్నారు. వయోజనులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి .. వారు చేసే పనిచేస్తూ ఫోటోలకు ఫోజిస్తున్నారు. మొన్న పొలంలోకి వెళ్లి ఓటు అడిగిన, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా ట్రాక్టర్ ఎక్కి ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. మథుర నియోజకవర్గానికి ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది.

గోవర్ధన్‌లో ట్రాక్టర్ ఎక్కిన హేమ
ప్రచారంలో భాగంగా శుక్రవారం హేమమాలిని తన నియోజకవర్గంలోని గోవర్ధన్ లో ప్రచారం చేశారు. అక్కడ పొలంలో ఉన్న ట్రాక్టర్ నడిపి ఓటర్ల మది దోచుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాదు మథురలో విజయదుందుబి మోగించేది తానేనంటు విజయసంకేతం చూపించారు హేమమాలిని. మొన్న గోవర్ధన్ లో మహిళలతో కలిసి కొడవలి పట్టి గోధుమ పంట కోశారు హేమమాలిని. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరలైన సంగతి తెలిసిందే.

previous farm, today tractor drive : hemamalini election campaign

మరోసారి విజయంపై ధీమా
గత ఎన్నికల్లో మథుర నుంచి పోటీచేసి గెలుపొందారు హేమమాలిని. ఈసారి కూడా అక్కడినుంచి బరిలోకి దిగి .. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఐదేళ్లలో మథుర నియోజకవర్గానికి హేమమాలిని చేసిందేమీ లేదని విమర్శలు వచ్చాయి. అయితే బీజేపీ మరో ఛాన్స్ ఇవ్వడంతో .. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డ్రీమ్ గార్ల్ పాట్లు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+