అయ్యప్ప మాలతో శబరిమలకు చర్చి ఫాదర్ రెవరెండ్ మనోజ్: చర్యలు
తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల కొండలను అధిరోహించాలనే తన ఆధ్యాత్మిక నిర్ణయంపై క్రైస్తవ మతగురువు రెవరెండ్ డాక్టర్ మనోజ్ కేజీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు ఆయన తన అన్యమత చర్య కోసం అతనిపై చర్చి చర్యలకు ఉపక్రమించింది. మతాచారాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో చర్చి పాదర్ మనోజ్ లైసెన్స్, గుర్తింపు కార్డును రద్దు చేసింది.
ఆంగ్లికన్ ప్రీస్ట్ ఫాదర్ మనోజ్ శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప మాల ధరించారు.
త్వరలోనే శబరిమలలో కొలువైన అయ్యప్పను సందర్శించుకుంటానని తెలిపారు. 50 ఏళ్ల మనోనోజ్ ప్రసిద్ధ ఫాదర్ శబరిమల క్షేత్ర సందర్శన కోసం రెవరెండ్ లైసెన్స్ కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన రెవరెండ్ డాక్టర్ మనోజ్ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాలో ఫాదర్‌గా ఉన్నారు. ఆయనకు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. దీంతో ఆయన అయ్యప్ప మాల ధరించారు. శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని తెలిపారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని.. ఫాదర్ మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.
మనోజ్ రెవరెండ్ గుర్తింపు కార్డును రద్దు చేసింది. ఆయన నుంచి రెవరెండ్ కార్డును స్వాధీనం చేసుకుంది. అయ్యప్పను దర్శించుకునే భక్తులు మాల ధరించినట్లుగానే ఫాదర్ మనోజ్ కూడా అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల సందర్శించుకుంటానని తెలిపారు. సెప్టెంబర్ 20న అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు. తనకు మతాలు ముఖ్యం కాదని దేవుడు ముఖ్యమని చెప్పారు. హిందూ మతం పాటించేవారు అన్ని మతాల దేవుళ్లను ఆదరిస్తారని చెప్పుకొచ్చారు.

కాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసిన మనోజ్ 2010లో ఆధ్యాత్మికతవైపుగా పయనించారు. 2015లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తగా మారారు. 2022లో రెవరెండ్ స్థానాన్ని పొందారు. జీతం కూడా తీసుకోకుండా క్రైస్తవ బోధనలు చేసేవారు. ఈ క్రమంలో మనోజ్ కు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దీంట్లో భాగంగానే ఎన్నో పుస్తకాలు చదివేవారు.
ఈక్రమంలోనే అయ్యప్ప మాల ధరించారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక సెప్టెంబర్ 20న శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు. క్రైస్తవ నియమాలను ఉల్లంఘించినందుకు తన బోధనల లైసెన్స్‌ను వదులుకున్నారు మనోజ్.












Click it and Unblock the Notifications