ఏడాది పాలనలో అవినీతి లేదు, దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసింది: మోడీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బీజీపీ ‘జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభను సోమవారం నిర్వహించింది. ఈ ‘జన కళ్యాణ్ పర్వ'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముందుగా దీన్‌దయాళ్ ధామ్ వద్ద దీన్‌దయాల్ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.
మధురలో ఏర్పాటు చేసిన 'జన కల్యాణ్ పర్వ'లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణుడు నివసించిన పుణ్యభూమి మధుర అని అన్నారు. భారత రాజకీయ పరిపక్వతకు దీన్ దయాళ్ ముందు చూపు ఎంతగానో దోహదపడిందని అన్నారు.

ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రధాని మోడీ తమ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిందని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.
30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకున్నారని అన్నారు.పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, పేదల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పారు.
బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ అవినీతిని అరికట్టామని, ప్రభుత్వ సబ్సిడీని నేరుగా వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం పోయిందని, యూపీఏ ప్రభుత్వం దేశాన్ని దారుణంగా లూటీ చేసిందని మోడీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
ఎన్డీయే పాలనలో నేతల కొడుకులు, అవినీతి అల్లుళ్ల కథలు లేవని గుర్తు చేశారు. గడిచిన 60 ఏళ్లలో దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు.
దేశంలో చెడ్డ రోజులు, చెడ్డ పనుల నుంచి ప్రజలకు 365 రోజుల్లో విముక్తిని కల్పించామని అన్నారు. గాంధీ, లోహియా, దీన్‌దయాళ్ ఈ ముగ్గురి ఆలోచనలను పంచుకుందామని అన్నారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
మధురలో ఏర్పాటు చేసిన ఈ 'జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభలో మోడీ ప్రసంగాన్ని వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
I want to ask you today, didn't I deliver on my promises? loot has been put to an end or not? PM Modi pic.twitter.com/rtWwKQpf2X
— ANI (@ANI_news) May 25, 2015 Ab aapne koi ghotaale sune hain? Bure din gye ki nhi? loot ka zamaana gya ki nhi gya? PM Modi pic.twitter.com/cyQQ145U21
— ANI (@ANI_news) May 25, 2015 Pehle remote control se sarkar chalti thi ki nhi? koyle ki chhori hui ki nhi? kitne bure din the,bure karma the: PM pic.twitter.com/tW6PfqNe5j
— ANI (@ANI_news) May 25, 2015 Aap mujhe bataiye agar aapne yeh sarkar nahi chuni hoti, toh kya desh ka haal badla hota? Parivartan aaya hota?: PM pic.twitter.com/NB8sZLqDVB
— ANI (@ANI_news) May 25, 2015 PM Narendra Modi addressing a rally in Mathura (UP) pic.twitter.com/RY63YG4v9z
— ANI (@ANI_news) May 25, 2015 PM Narendra Modi arrives in Mathura (UP), will address a rally shortly. pic.twitter.com/PSUT31teIj
— ANI (@ANI_news) May 25, 2015 Crowd gathered for PM Narendra Modi's rally in Mathura (UP). pic.twitter.com/mHRpHoJSlx
— ANI (@ANI_news) May 25, 2015 PM Narendra Modi arrives in Mathura (UP), will address a rally shortly. pic.twitter.com/oo5ecS51He
— ANI (@ANI_news) May 25, 2015 -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications