హడలెత్తిస్తున్న సైకో.. భయాందోళనలో కాలనీవాసులు.. ఫేస్ బుక్ లో హెచ్చరికలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బనశంకరి: కామాంధుడు ఉమేశ్ రెడ్డి పోలికలతో ఉన్న ఓ సైకో ఇక్కడి రాజరాజేశ్వరి నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆరు నెలలుగా మహిళలను టార్గెట్ చేస్తూ.. అర్థరాత్రిళ్లు ఇళ్లల్లోని కిటికీల్లో నుంచి బెడ్ రూమ్, బాత్ రూమ్ దృశ్యాలను వీక్షించడం పనిగా పెట్టుకున్నాడు.

ఈ సైకో గురించి స్థానికులు ఎంతగా భయపడుతున్నారంటే.. 'ఇది కేవలం వదంతి కాదు..' అని ఫేస్ బుక్ లో పేర్కొంటూ.. రాజరాజేశ్వరి నగర్ వాసులకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులను హెచ్చరిస్తున్నారు.

''అందరికీ హాయ్.. రాజరాజేశ్వరి నగర్ వాసులకు ఓ హెచ్చరిక. బీఈఎమ్ఎల్ 5వ స్టేజ్ న్యూహారిజన్ వద్ద ఒక సైకో కనిపించాడు. ఈ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్లల్లోకి చొరబడుతున్నాడు.. బెడ్ రూమ్, వాష్ రూముల్లో మహిళలను చూడడం ఇతడికి పనిగా మారింది. రాత్రి 11 నుంచి 2 గంటల మధ్యలో ఇతడు ఇళ్లలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నాడు..'' అంటూ ఈ సందేశం సాగుతోంది.

Psycho Fear in Rajarajeshwari Nagar.. Alerts in Facebook

ఇంకా ''ఈ సైకోని పట్టుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇతడు కాంపౌండ్ గోడల మీదగా దూకడం, పారిపోవడంలో సిద్ధహస్తుడు. ప్రమాదకరంగా మారిన ఇతని సీసీ టీవీ ఫుటేజిని కూడా అటాచ్ చేశాము, మీ కుటుంబ సభ్యులకు ఈ సైకో గురించి సమాచారం ఇవ్వండి..'' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని కేవలం సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేయడానికే పరిమితం చేయకుండా రాజరాజేశ్వరి నగర్ పోలీసుస్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచి, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను విచారిస్తున్నారు.

అయితే సదరు సైకో మాత్రం మళ్లీ మళ్లీ అదే ఏరియాలో కనిపిస్తూ మహిళలను హడలెత్తిస్తున్నాడు. పోలీసులు కూడా ఇతడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Psycho who looks like Umes Redy is creating terror in Rajarajeswari Nagar residents since six months is revealed as facebook alerts. At nights he is going to the houses and watching the bedrooms, bathrooms through windows.
Please Wait while comments are loading...