ఒకే దేశం.. ఒకే భర్త.. ఆపరేషన్ సింధూర్ పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన అస్త్రమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ చర్యను యావత్ భారతావని ప్రశంసించింది. ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి.

అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం పంజాబ్ లోని లుథియానాలో సింధూరం పంపిణీ కార్యక్రమం చేపట్టడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఒకే దేశం.. ఒకే భర్త(వన్ నేషన్- వన్ హస్బెండ్) పథకం ఏమైనా ప్రారంభించిందా..? అని ప్రశ్నించారు.

పంజాబ్ లోని లుథియానా వెస్ట్ లో జూన్ 19 ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఓట్లు అడుగుతోందన్నారు. సింధూర్ అనే పదాన్ని ఒక హాస్యాస్పదంగా మార్చేశారని మండిపడ్డారు. పంజాబ్ లోని ప్రతి ఇంటికీ సింధూర్ పంపుతున్నారని.. ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సింధూర్ రాసుకుంటారా? ఇది 'ఒకే దేశం, ఒకే భర్త' పథకమా? అని భగవంత్ మాన్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

Punjab CM Bhagwant Mann Makes Sensational One Nation-One Husband Remark

అయితే పంజాబ్ సీఎం వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత ప్రీత్ పాల్ సింగ్ భలియావాల్ పేర్కొన్నారు. సీఎం భగవంత్ మాన్.. ఇండియన్ ఆర్మీని కించపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు. మరోవైపు ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది బీజేపీ మెదడులోంచి పుట్టిందని.. ఇది రాజకీయ ప్రేరేపితం అని దీదీ పేర్కొంది. ఇటీవల ప్రధాని మోదీ బెంగాల్ పర్యటన చేసిన సమయంలోనూ.. ప్రధాని మోదీ సిందూర్ అమ్మేందుకు బెంగాల్ వచ్చారని దీదీ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+