అమరీందర్ సింగ్‌కు మోడీ... మోడీకి రాహుల్ శుభాకాంక్షలు..
ప్రధాని మోడీ పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో ఘనవిజయం బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చింది. దీంతో కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో పంజాబ్,గోవా రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకుంది. అయినా యూపీ విజయం ముందు అవి బీజేపీ మీద అంతగా ప్రభావం చూపవని అందరికీ తెలిసిందే.
మరోవైపు పంజాబ్ లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో జయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అమరీందర్ సింగ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు అమరీందర్ సింగ్ పుట్టినరోజు కూడా కావడంతో.. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

ఫోన్ ద్వారా అమరీందర్ సింగ్ కు శుభాకాంక్షలు చెప్పిన మోడీ.. అనంతరం అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్.. లంబి, పాటియాలా రెండు చోట్ల పోటీ చేయగా.. లంబిలో పరాజయం పాలయ్యారు. పాటియాలలో మాత్రం 51వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం పంజాబ్ లో కాంగ్రెస్ 74స్థానాలు గెలుచుకుని మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాహుల్ శుభాకాంక్షలు:
పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రాహుల్ ఆ పార్టీ అభ్యర్థి అమరీందర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో యూపీ, ఉత్తరాఖండ్ లో విజయం సాధించిన బీజేపీకి సైతం రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్నికల పరాజయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రజల మనసులు గెలుచుకునేంతవరకు తమ పోరాటం ఆగదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications