ఆన్‌లైన్‌లో మహిళ అశ్లీల వీడియోలు: వ్యక్తి అరెస్ట్
పథంకోట్: ఓ మహిళ అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నవదీప్ కుమార్ అలియాస్ లక్కీ అనే నిందితుడు, సదరు మహిళ 2005లో కొంతకాలంపాటు సన్నిహితంగా ఉన్నారు.
కాగా, ఆ మహిళకు 2011లో వేరే వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ తనతో సంబంధం కొనసాగించాలని లేకపోతే అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానని లక్కీ.. ఆ మహిళను బెదిరింపులకు గురిచేశాడు.

ఆమె అందుకు అంగీకరించకపోవడంతో అశ్లీల వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications