వీళ్లు యూట్యూబర్లు కాదు.. దేశ ద్రోహులు.. అంతా కలిసి బిగ్ స్కెచ్.. విచారణలో పోలీసులు షాక్..!
భారత్ లో ఉంటూ పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఐఎస్ఐ సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయట పడింది. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న మరింతమందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
తాజాగా పాకిస్థాన్ కు గూఢచర్యం కేసులో అరెస్టయిన పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పోలీసులు విచారించారు. దీంతో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన మాజీ పోలీసు అధికారి.. ఇండియన్ యూట్యూబర్లను పరిచయం చేసుకుని గూఢచర్యంలోకి దింపినట్లు తేలింది. పాకిస్థాన్ లోని పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన నజీర్ అనే అధికారి.. భారత్ లోని యూట్యూబర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. నజీర్ పదవీ విరమణ తర్వాత ఐఎస్ఐ లో చేరాడు. ఆ తర్వాత యూట్యూబర్ గా మారి తోటి భారత యూట్యూబర్ లతో పరిచయం పెంచుకున్నాడు.
అలా జస్బీర్ సింగ్, జ్యోతి మల్హోత్రా.. తదితర యూట్యూబర్లతో ఫ్రెండ్ షిప్ చేసి వారిని గూఢచర్యంలోకి లాగినట్లు సమాచారం. ఐఎస్ఐ, భారత్ యూట్యూబర్లకు మధ్య నజీర్ వారథిగా పనిచేసినట్లు విచారణలో తేలింది. అంతేకాక జస్బీర్ సింగ్ మొబైల్ లో పాకిస్థాన్ కు చెందిన దాదాపు 150 నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇప్పటివరకు ఆరు సార్లు జస్బీర్ పాకిస్థాన్ ను వెళ్లి వచ్చినట్లు అధికారుల విచారణలో తేటతెల్లం అయింది.
అంతేకాక జస్బీర్ సింగ్ విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జస్బీర్ సింగ్ తన కంప్యూటర్ ను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతర గూఢచారుల మాదిరిగానే జస్బీర్ కూడా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన తర్వాత ఆమెను విచారించిన పోలీసులు.. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న డానిష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడ్ని దేశం నుంచి బహిష్కరించారు అధికారులు. ఈ మేరకు డానిష్, నజీర్ లు పాకిస్థాన్ కు గూఢచర్యం చేసేందుకు భారత యూట్యూబర్ లను ఒప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications