ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌లు.. ఇక గ్యాస్ దొంగలకు తిప్పలే!!

గ్యాస్‌ సిలిండర్లకు ఇక క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లు త్వరలో క్యూఆర్ కోడ్ లతో వస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పేర్కొన్నారు.

గ్యాస్ చౌర్యానికి చెక్ పెట్టటానికి కేంద్రం నిర్ణయం

గ్యాస్ చౌర్యానికి చెక్ పెట్టటానికి కేంద్రం నిర్ణయం


కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ విధానం ఎల్పిజి సిలిండర్ల గ్యాస్ దొంగలకు చెక్ పెట్టడానికి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల లో గ్యాస్ చౌర్యం నిత్యకృత్యంగా మారింది. ఎన్ని మార్లు వినియోగదారులు ఫిర్యాదు చేసినా గ్యాస్ చౌర్యానికి సంబంధించి సరైన స్పందన రావడం లేదు. దీంతో యదేచ్ఛగా గ్యాస్ దొంగతనానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై క్యూఆర్ కోడ్ లను ఏర్పాటుచేసి గ్యాస్ దొంగతనానికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ ను ట్రాక్ చేయటానికి క్యూఆర్ కోడ్


ఎల్పిజి సిలిండర్ లకు క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేయడంవల్ల వినియోగదారులు అనేక సౌకర్యాలను పొందుతారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వల్ల గ్యాస్ చౌర్యాన్ని నిరోధించడానికి వీలవుతుందని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఇది కొంత వరకు ఆధార్ కార్డులా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గ్యాస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ ను ట్రాక్ చేయడం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల బరువు, డీలర్‌ పేరు మొదలైనవి సులభంగా తెలుసుకోవచ్చని, గ్యాస్‌ చౌర్యాన్ని కూడా అరికట్టవచ్చని తెలిపారు.

ఇది ఒక విశేషమైన ఆవిష్కరణ అని పేర్కొన్న కేంద్ర మంత్రి

ఇది ఒక విశేషమైన ఆవిష్కరణ అని పేర్కొన్న కేంద్ర మంత్రి


క్యూఆర్ కోడ్స్ గ్యాస్ సిలిండర్లకు భద్రతను అందించడానికి, వాటి భద్రతా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. అంతేకాదు సిలిండర్ల యొక్క పంపిణీ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతున్నది అనేది నిర్ధారించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇది ఒక విశేషమైన ఆవిష్కరణ అని పేర్కొన్న ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ ఎల్పిజి వీక్ 2022 సందర్భంగా హర్దీప్ సింగ్ పురి ఈ విషయాన్ని తెలియజేశారు.

సిలెండర్ పై క్యూఆర్ కోడ్ తో అన్ని వివరాల ట్రాకింగ్ ఈజీ

సిలెండర్ పై క్యూఆర్ కోడ్ తో అన్ని వివరాల ట్రాకింగ్ ఈజీ


ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న వరల్డ్ ఎల్పిజి వీక్ 2022 ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేసిన ఆయన దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వల్ల గ్యాస్ సిలిండర్ ఎక్కడినుంచి ఎక్కడకు డెలివరీ అవుతుంది వంటి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఎన్ని సార్లు గ్యాస్ రీఫిల్ చేశారు అన్న విషయం కూడా వినియోగదారులకు ఇట్టే తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేయడంవల్ల గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇక క్యూఆర్ కోడ్ లతో గ్యాస్ సరఫరా వ్యవస్థ పటిష్ఠంగా జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+