వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు అధినేత: చిన్నప్పుడు స్కూల్స్ మారుస్తూ...

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi Coronation : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలి ప్రసంగం

న్యూఢిల్లీ: తన తల్లి సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ ఐసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎలా సాగిందనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయమే.

గాంధీ వారసుడిగా కాంగ్రెసు పగ్గాలు చేపట్టిన ఆయన అత్యంత బలమైన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి సిద్దపడ్డారు. ఆయన 1970 జూన్ 19వ తేదీన జన్మించారు. ప్రస్తుతం అమేథీ నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. భారత యువజన కాంగ్రెసు, ఎన్‌ఎస్‌యుఐ చైర్‌పర్సన్‌గా కూడా కొనసాగుతున్నారు. రాజీవ్ గాందీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు ట్రస్టీగా ఉన్నారు.

భద్రతా కారణాల రీత్యా ఇలా...

భద్రతా కారణాల రీత్యా ఇలా...

నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని చిన్నప్పుడు భద్రతా కారణాల రీత్యా ఎప్పటికప్పుడు స్కూల్స్ మారుస్తూ వచ్చారు. తన పేరును దాచి పెట్టుకుని ఆయన విదేశాల్లో విద్యనభ్యసించారు. ఆయనను విశ్వవిద్యాలయం అధికారులు, భద్రతా సంస్థలకు చెందినవారు మాత్రమే గుర్తు పట్టేలా ఏర్పాట్లు చేశారు.

ఈ పాఠశాలల్లో చదివారు...

ఈ పాఠశాలల్లో చదివారు...

సోనియా, రాజీవ్ గాంధీలకు జన్మించిన రాహుల్ గాంధీ ఢిల్లీలోని కొలంబియా స్కూల్లో, డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదివారు. ఈ సమయంలోనే ఇందిరా గాంధీ హత్యతో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విద్య ఇంట్లోనే సాగింది.

రాహుల్ గాంధీ ఇక్కడ పనిచేసరు

రాహుల్ గాంధీ ఇక్కడ పనిచేసరు

రోలిన్స్, కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయాల్లో రాహుల్ గాంధీ అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి అధ్యయనాలపై డీగ్రీలు పొందారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన మేనేజ్‌మెట్ కన్సల్టింగ్ కంపెనీ మోనిటర్ గ్రూప్లో పనిచేశారు. ఆ తర్వాత ముంబైలో టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్ కంపెనీ బ్యాకప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ను స్థాపించారు.

ఇలా రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ

ఇలా రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ

దాదాపు 14 ఏళ్ల క్రితం ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007లో కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు. ఈ పదవిని గతంలో ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ, తన తండ్రి రాజీవ్ గాంధీ కూడా నిర్వహించారు. 2013లో కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

రాహుల్ గాంధీకి చేదు అనుభవం...

రాహుల్ గాంధీకి చేదు అనుభవం...

2014 లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెసు ప్రచార సారథ్య బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అయితే, ఆయనకు ఆ ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెసు ఘోరంగా ఓటమి పాలైంది. గతంలో లోకసభలో 206 సీట్లు ఉన్న కాంగ్రెసు పార్టీ 44 సీట్లకు కుదించుకుపోయింది.

English summary
Rahul Gandhi comes from the Nehru–Gandhi family. Due to security concerns, Gandhi constantly had to shift schools in his youth. He studied abroad under a pseudonym.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X