Viral Video: డివైడర్ దూకి స్వీట్ షాప్ లో స్వీట్లు కొని స్టాలిన్ కు ఇచ్చిన రాహుల్..!

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ నిన్న తమిళనాడులోని కోయంబత్తూర్ లో పర్యటించారు. కోయంబత్తూరులో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యే్ందుకు వచ్చిన రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సభలో మరోసారి రాహుల్ గాంధీ, ఆయన స్నేహితుడిగా భావించే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరస్పరం ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ స్టాలిన్ కు స్వీట్లు కూడా అందించారు.

అయితే ఈ స్వీట్లు కొనేందుకు రాహుల్ గాంధీ చేసిన ఓ సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రాహుల్ గాంధీ తన స్నేహితుడు ఎంకే స్టాలిన్ కు కోయంబత్తూరు సభకు హాజరయ్యే ముందు స్వీట్లు తీసుకెళ్లాలని భావించారు. అనుకున్నదే తడవుగా స్వీట్ షాపుకు బయలుదేరారు. అయితే మధ్యలో రోడ్డు అవతల ఉన్న షాపుకు చేరుకోవాలంటే భారీ ట్రాఫిక్ ఉంది. దీన్ని బ్రేక్ చేసేందుకు అక్కడే రోడ్డు పక్కన కారు ఆపేసి రోడ్డు క్రాస్ చేసారు.

rahul gandhi jumped road divider for buying sweets for tamilandu cm mk stalin

అక్కడ రోడ్డు మధ్యన ఉన్న డివైడర్ ను ఉత్సాహంగా దూకేసి రోడ్డు దాటారు. అనంతరం రోడ్డు ఆవల ఉన్న స్వీట్ షాపులోకి వెళ్లి స్వీట్లు ఆర్డర్ చేశారు. అంతే ఆ షాపు నిర్వాహకులతో పాటు అందులో పనిచేస్తున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ షాపుకు వచ్చిన రాహుల్ గాంధీని స్వాగతించి ఆయన కోరిన స్వీట్లు ఇచ్చారు. అనంతరం ఆయనతో ఫోటోలు కూడా దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన రాహుల్.. స్టాలిన్ ను కలిసి ఆ స్వీట్లు అందించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ వీడియోను సీఎం స్టాలిన్ తో పాటు డీఎంకే, కాంగ్రెస్ నేతలంతా సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+