రాహుల్‌గాంధీ జిందాబాద్, కోజికోడ్ రోడ్ షోలో చిన్నారి హంగామా.. ముద్దుపెట్టిన రాహుల్
కోజికోడ్ : అమేథీ ప్రజలు తిరస్కరించగా .. వాయనాడు ప్రజలు అక్కున చేర్చుకోవడంతో అక్కడి ప్రజలకు ధన్యావాదాలు చెప్పేందుకు వచ్చిన రాహుల్ గాంధీ పర్యటన ఆదివారంతో ముగిసింది. ఇక్కడ మెజార్టీ ఓట్లతో రాహుల్ గాంధీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారికి ధన్యావాదాలు చెప్పేందుకు మూడురోజుల సమయం కేటాయించారు. మూడురోజుల్లో నియోజవకర్గం చుట్టి .. అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ పర్యటనలో చాలా విశేషాలు జరిగాయి.
చిన్నారి హల్‌చల్
40 ఏళ్ల క్రితం సోనియా రాహుల్‌కు జన్మనిచ్చే సమయంలో పక్కనే ఉన్న నర్సు రాజమ్మ కాంగ్రెస్ చీఫ్‌ను కలిసింది. ఇదో అపూర్వ ఘట్టం. దీంతోపాటు ఇవాళ్టి రోడ్ షోలో మూడేళ్ల చిన్నారి రాహుల్‌ను తెగ ఆకట్టుకుంది. ఇవాళ కోజికోడ్‌లో రాహుల్ ర్యాలీగా వెళ్తున్నారు అయితే అక్కడ ఓ చిన్నారి ఉంది. వయస్సు మూడేళ్లు కూడా ఉండవు. ఆ చిట్టితల్లి రాహుల్ గాంధీ జిందాబాద్ అనడంతో అక్కడున్నవారితో రాహుల్‌ను కూడా ఆకట్టుకుంది.

దీంతో రాహుల్ చిన్నారిని తన వద్దకు తీసుకున్నారు. రాహుల్ ఒడిలో చిన్నారి చిరునవ్వులు చిందించింది. అమాయకంగా మొహం పెట్టుకుని ... మరోసారి రాహుల్ గాంధీ జిందాబాద్ అని అనడంతో .. రాహుల్ కూడా ఉద్దేగానికి గురయ్యారు. ఆ పసి మనసు తనపై చూపిస్తున్న ప్రేమకు గుర్తుగా .. బుగ్గపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మోడీపై గరం .. గరం ...
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మాత్రం ... ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీజేపేయేతర రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ సర్కార్ భయపెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై పక్షపాతం కూడా చూపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వాయనాడు, కేరళ రాష్ట్ర సమస్యల కోసం శ్రమిస్తానని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications