రైల్వే బెడ్ షీట్ తో కుర్తా... వైరల్ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్ళలో ఏసీ కోచ్ లలో బెడ్ షీట్ లు, బ్లాంకెట్ లు అందిస్తుంది. అయితేఈ బెడ్ షీట్ లు మాయం చేస్తున్న ఘనులు కూడా ఉన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇప్పటివరకు మన భారతీయ రైళ్ళలో లక్షల సంఖ్యలో బెడ్ షీట్స్, బ్లాంకెట్ లు మాయం అయ్యాయి.

మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ జిల్లాలో జరిగిన సంఘటన

అయితే ఈ నష్టం రైల్వే తన ఉద్యోగులపై వేస్తుంది. వారి జీతం నుండి కోత విధించి నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఈ బెడ్ షీట్ ల దొంగలతో రైల్వే ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఎన్నో.. ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Railway bedsheet kurta old man with railway bedsheet kurta video viral netizens comments

రైల్వే బెడ్ షీట్ కుర్తా ధరించిన వృద్ధుడి వీడియో వైరల్

గౌరిహార్ మార్కెట్ లో ఒక వృద్ధుడు రైల్వే బెడ్ షీట్ తో కుట్టిన ఒక కుర్తా ధరించి తిరగటం, ఈ దృశ్యాన్ని ఒక కంటెంట్ క్రియేటర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్ అవుతుంది. ఆ కుర్తా మీద వెస్ట్రన్ రైల్వే లోగో ఉండటం కూడా ప్రధానంగా కనిపించింది.

వెస్ట్రన్ రైల్వే బెడ్ షీట్ తో కుట్టిన కుర్తాతో ఎంత హాయిగా తిరుగుతున్నాడో

కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ గౌరీహార్ మార్కెట్ లో ఈ కాకాను చూడండి. వెస్ట్రన్ రైల్వే బెడ్ షీట్ తో కుట్టిన కుర్తా వేసుకుని ఎంత హాయిగా తిరుగుతున్నాడో అంటూ వీడియో చేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మొదట తనను వీడియో తీస్తున్నారని ఇబ్బంది పడిన సదరు వృద్ధుడు ఆపైన మార్కెట్ అంతా బిందాస్ గా తిరిగాడు. ప్రస్తుతం ఈ వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రైల్వే బ్రాండ్ అంబాసిడర్ అని నెటిజన్ల వ్యాఖ్యలు

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు సరదాగా, కొందరు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.ఈయన రైల్వే బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యలు చేస్తే, మంచి ఫ్యాషనబుల్ వేర్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే మీది అని చెప్పినందుకు మనదే అని ఇలా వాడేస్తున్నారని కొందరు టార్గెట్ చేస్తున్నారు. మరికొందరు అనధికారికంగా ఏసీ కోచ్ లలో ఎక్కి బెడ్ షీట్స్ మాయం చేస్తున్నారని అన్నారు.

వేలం వేసిన దాంతో కుట్టిందా?

ఇలా దుర్వినియోగం అవుతున్నాయని, అనధికారికంగా ఏసీ కోచ్ లలో ఎక్కకుండా చూడాలని కొందరు అంటున్నారు. ఇది ఇలా ఉంటే భారతీయ రైల్వే కూడా రైళ్ళలో వాడిన పాత బెడ్ షీట్ లను వేలం వేస్తుంది, వాటిని కొనుగోలు చేసేవారు వివిధ వస్తువులకు తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు. ఇలా వృద్ధుడి కుర్తా కూడా అలాగే తయారు చేసిందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+