రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!

దేశవ్యాప్తంగా వ్యాపారులకు చేసే 2 వేలకు మించిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తూ తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం దేశంలో ఏ వ్యాపారికి చేసే 2 వేలకు మించిన చెల్లింపుపై అయినా సదరు వ్యాపారి నుంచి 0.4 శాతం చొప్పున ఎండీఆర్ ఛార్జీల్ని బ్యాంకులు వసూలు చేస్తాయి. సాధారణ వ్యాపారులు తమకు పడే ఛార్జీల్ని వినియోగదారుల్ని బదలయిస్తారన్న భయాల నేపథ్యంలో.. .రైల్వేకు టికెట్ల బుకింగ్స్ లో సహకారం అందిస్తున్న ఐఆర్సీటీసీ (IRCTC) వినియోగదారులపై ఈ యూపీఐ ఛార్జీలు విధించబోతోందా అన్న చర్చ జరుగుతోంది.

అక్టోబర్ 15 నుంచి యూపీఐ ద్వారా చేసే రైలు టిక్కెట్ బుకింగ్‌లో (Railway Ticket Booking) మార్పు చోటు చేసుకోనుంది. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన కొత్త ఎండీఆర్ ఛార్జీల విధానంలో భాగంగా రైల్వే టిక్కెట్ బుకింగ్‌లను ఒక ప్రత్యేక కేటగిరీలో ఉంచారు. దీని ప్రకారం 2 వేలు పైబడిన రైల్వే టిక్కెట్ చెల్లింపులకు, టిక్కెట్ విలువలో 0.4 శాతానికి బదులుగా, ప్రతి లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ వర్తిస్తుంది. ఈ రూ. 5 UPI ఛార్జీని ప్రయాణికులకు బదిలీ చేయరు. ఈ ఛార్జీ వ్యాపారుల వైపు వర్తిస్తుంది.

Railway Ticket Booking New UPI Rule for Payments Above 2 000 From October 15

అక్టోబర్ 15 నుంచి కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం అమల్లోకి వస్తున్నప్పుడు యూపీఐ ద్వారా 2 వేలకు పైగా మొత్తం చెల్లించాల్సి వస్తే ప్రయాణికులు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రూ.5 అనేది మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని, ఇది వ్యాపారి వైపు వర్తించే చెల్లింపు-ప్రాసెసింగ్ ఛార్జ్ అని ఆయన వివరించారు. వ్యాపారులు ఈ ఛార్జీని వినియోగదారులకు బదిలీ చేయకుండా చూసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+