వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ- వారి కోసం స్పెషల్స్, ఫుల్ డిమాండ్...!!

తొలి వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కింది. అందులో ప్రయాణం చేసిన వారు తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. బెర్తులు.. దుప్పట్లు.. వాష్ రూమ్స్ సహా అన్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. టికెట్ ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నా.. డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. అదే విధంగా టికెట్ల రద్ద విషయంలో నిబంధనలు కఠినంగానే అమలు చేస్తున్నారు. ఇక.. దూరపు ప్రాంతాల మధ్య నడవనున్న ఈ వందేభారత్ స్లీపర్ లో ఫుడ్ మెనూ విషయంలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

మొట్టమొద‌టి వందేభార‌త్ స్లీప‌ర్ హౌరా-గౌహతి మధ్య ప్రారంభమైంది. ఈ రైలు పట్టాలెక్కినప్పటి నుంచి దీని గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. రైలు ఫీచర్స్‌ వంటి వాటి గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఈ రైల్లో ప్రయాణికులకు అందించే ఫుడ్‌ మెనూ నెట్టింట వైరల్‌ అవుతోంది. వందే భారత్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో గౌహతిలోని మేఫెయిర్‌ స్ప్రింగ్‌ వ్యాలీ రిసార్ట్‌.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా మెనూను రూపొందించింది.

Railways introduces Regional menus in Vandebharat Sleeper passengers details here

ఈ మెనూలో బెంగాలీ స్పెషల్‌ డిషెస్‌ అయిన బాసంతి పులావ్‌, ఛోలార్‌ దాల్‌, మూంగ్‌ దాల్‌, ధోకర్‌ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. అదే విధంగా వీటితోపాటూ అస్సాం పాక సంప్రదాయాలను ప్రతిబింబించేలా జోహా రైస్‌, మతి మోహోర్‌, మసూర్‌ దాల్‌, సీజనల్‌ వెజిటబుల్‌ ఫ్రైస్‌ను జతచేశారు.

ఇక స్వీట్స్‌లో సందేశ్‌, నారికోల్‌ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు. వీటన్నింటినీ మీడియం స్పైస్‌తో ప్రయాణికులు తినేవిధంగా తయారు చేసి అందిస్తున్నారు. అయితే.. ఈ తొలి రైలు ప్రయాణించే మార్గంలో ప్రయాణీకుల లోకల్ రుచులకు ప్రాధాన్యత ఇచ్చారు. భవిష్యత్ లో ప్రారంభించే రైళ్లల్లోనూ ఇదే విధంగా స్థానిక అభిరుచులకు అనుగుణంగా ఫుడ్ మెనూ అందించనున్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లల్లో టికెట్ల రిజర్వేషన్ సమయంలోనే కేటరింగ్ ఛార్జీలను కలిపి ధర ఖరారు చేసారు.

వందేభారత్ స్లీపర్ లోనూ ఇదే విధానం కొనసాగిస్తున్నారు. ఫుడ్ తీసుకోని వారికి ఆ ధరను టికెట్ రుసుము నుంచి మినహాయిస్తున్నారు. కాగా.. తొలి విడతలో మరో ఎనిమిది వందేభారత్ స్లీపర్లను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాలకు ఖాయమని సమాచారం. సికింద్రాబాద్ - న్యూ ఢిల్లీ లేదా విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ ఈ వారంలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+