వర్ష బీభత్సం : కేరళలో ఇళ్లలోకి నీరు, సాంగ్లీలో పడవ బోల్తా, 9 మంది మృతి (వీడియో)

Recommended Video

    కేరళలో ఇళ్లలోకి నీరు వరద నీరు || Many Areas In Kelara Badly Effected Due To Rains || Oneindia

    న్యూఢిల్లీ/ ముంబై : దేశవ్యాప్తంగా భారీ వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. వర్షాలతో మరోవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో .. నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ప్రవాహిస్తుండటంతో .. ఆ సమీప ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    దక్షిణాది రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. ఇడుక్కి, వాయనాడు, నిలిగిరిస్, థెని, తిరునెల్వెలి, వల్‌పారాయ్, కన్యకుమారి వరదనీటితో నిండిపోయాయి. కేరళలో వర్షపునీరు ఇళ్లలోకి చేరిపోయింది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. కేరళలో భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు తమిళనాడులో కూడా గత రెండురోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు 7 జిల్లాలో కూడా వర్షపునీరు చేరింది. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

    rain effect in south states.. in sangli boat collapse, 9 dead

    ఇటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. మరోవైపు సాంగ్లీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరద బాధితులను తరలిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. రెస్క్యూ టీం హుటాహుటిన భద్రతా చర్యలు చేపట్టారు. మరో 9 మందిని సిబ్బంది కాపాడారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన మరో 8 మంది గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి .. బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+