షాకింగ్: బంధువులొచ్చారని హల్వా చేస్తే.. అది తిని ఐదుగురు మరణించారు!

జైపూర్: ఇంటికి బంధువులు రావడంతో ఓ కుటుంబం వేడివేడిగా హల్వా తయారు చేసి వచ్చిన వారికి వడ్డించింది. అంతే - ఆ హల్వా తిని ఐదుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

రాజస్థాన్‌ భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... బంధువుల ఇంటికెళ్లి సరదాగా గడిపిరావాలనుకున్నారు కొంతమంది వ్యక్తులు. భుటేలా గ్రామంలోని బంధువుల ఇంటికెళ్లారు.

halwa

రాకరాక బంధువులు రావడంతో ఆ కుటుంబం కూడా సంతోషపడింది. ఆ ఆనందంలో వారు హల్వా తయారు చేసి వేడివేడిగా వడ్డించారు. కానీ దురదృష్టం.. ఆ హల్వాను ఆరగించి ఐదుగురు మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఫుడ్ పాయిజన్ కారణంగానే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+