అనంత్ అంబానీ పెళ్ళిలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టెప్పులు
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సౌత్ లో పేరెన్నిక గన్న రజినీకాంత్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజినీకాంత్ డ్యాన్స్
నిన్న పెళ్లిలో ప్రధాన ఘట్టం కావడంతో వివాహ వేడుక సాక్షిగా సెలబ్రిటీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అనంత్ అంబానీ వివాహ వేడుకలలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు మనం ఎప్పుడూ బయట చూడని కొత్త రజినీకాంత్ ను డాన్స్ చేస్తుండగా చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

73 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ డాన్స్
సహజంగా అంబానీ ఫ్యామిలీ వేడుకలలో బాలీవుడ్ స్టార్స్ కీలక భూమిక పోషిస్తారు అన్నది తెలిసిందే. అంబానీ ఇంట వేడుకలు ఏదైనా బాలీవుడ్ స్టార్ స్టెప్పులు వేస్తారు. ఇక తాజాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో 73 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ డాన్స్ అదరగొట్టారు. గల్లన్ గుడియా పాటకు స్టెప్పులేశారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రజనీకాంత్ తన భార్య లత, కూతురు ఐశ్వర్య, మనవడితో కలిసి వెళ్లారు.
రజినీకాంత్ ఆఫ్ స్క్రీన్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్
ఇక అనంత్ అంబానీతో కలిసి రణవీర్ సింగ్, అనిల్ కపూర్, ముఖేష్ అంబానీ తదితరులు స్టెప్పులు వేస్తుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వారితో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ఆఫ్ స్క్రీన్ డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక రజనీకాంత్ డాన్స్ చూసిన వారంతా ఎక్కడికి వెళ్లినా తలైవా స్పెషల్ అంటూ కితాబిస్తున్నారు.
Anant-Radhika Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్ళి వేడుకలో స్టెప్పులేసిన రజినీకాంత్ & షారుక్ ఖాన్ #Rajinikanth #ShahRukhKhan #AnantRadhikaWedding #AnantAmbani #RadhikaMerchant #AnantAmbaniRadhikaMerchant #AnantAmbaniRadhikaMerchantWedding pic.twitter.com/zdqNXzNBaM
— oneindiatelugu (@oneindiatelugu) July 13, 2024
తలైవా తగ్గేదేలే
ఈ వయసులో కూడా అస్సలు తగ్గట్లేదని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. రజినీకాంత్ ఒక అద్భుతమైన డ్యాన్సర్ అని తమ అభిమాన హీరోని తెగ పొగుడుతున్నారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకలు ముఖేష్ అంబానీకి చెందిన వరల్డ్ జియో సెంటర్ లో అత్యంత ఘనంగా జరిపించారు. ఈ రాయల్ వెడ్డింగ్ లో ప్రముఖులు సందడి చేశారు.












Click it and Unblock the Notifications