చిరు ఇంటిపై రాజ్‌నాథ్ కన్ను: పవన్‌ కళ్యాణ్‌ను చూసి?

న్యూఢిల్లీ : కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంటిపై కన్ను పడినట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న బంగళాను తనకు కావాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరుకుంటున్నారు. అయితే, దానిని ఎలా సాధ్యం చేసుకోవాలో రాజ్‌నాథ్‌కు అంతు పట్టడం లేదు.

మెగా స్టార్‌ చిరంజీవికి 2009లో ఢిల్లీలో టైప్‌ 8 విస్తృత బంగళాను కేటాయించారు. వాస్తవానికి చిరంజీవి అందుకు అర్హుడు కానప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్‌పి)ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధి రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఔదార్యంతో ఆయనకు ఆ బంగళా కేటాయింపు జరిగింది. అయితే, ఇప్పుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ కన్ను ఆ బంగళాపై పడింది.

Pawan Kalyan - Chiranjeevi

ప్రతి సీజన్‌లో ఐదు టన్నుల బంగాళా దుంపలు పండించేంత స్థలం ఆ బంగళా ఆవరణలో ఉంది. అంతే కాకుండా ఆ ఆవరణలోని లాన్స్‌లో ఒక పెళ్లి పార్టీకి ఆతిథ్యం ఇవ్వగలిగినంత వెసులుబాటు ఉంది. కాని రాజ్‌నాథ్‌ హోదా, పలుకుబడి ఎంత అధికంగా ఉన్నా ఆయన చిరంజీవిని అక్కడి నుంచి ఖాళీ చేయించలేక పోవచ్చునని అంటున్నారు.

అందుకు కారణం మెగా స్టార్‌ చిరంజీవి చిన్న తముడు, పవన్‌ కల్యాణ్‌. రాజ్‌నాథ్‌ అటువంటి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురవుతాడనే ఆందోళన రాజ్‌నాథ్ సింగ్‌ను బాధిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సాయమే లేకపోతే సీమాంధ్రలో టిడిపి-బిజెపి కూటమి ఘన విజయం సాధించలేకపోయేది.

ఇది ఇలా ఉండగా, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జాప్యానికి కొత్త మంత్రులకు వసతి కల్పన కోసం ప్రభుత్వ బంగళాలు లభ్యం కావడం కష్టంగా ఉండడమేనని అంటున్నారు. గత యుపిఎ మంత్రులు ఇంకా బంగళాలలో తిష్ఠ వేయడమే ఇందుకు కారణం. మాజీ మంత్రులను ఖాళీ చేయించవలసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ఒత్తిడి వస్తోంది.

మాజీ యుపిఎ మంత్రులు, ప్రస్తుత ఎన్‌డిఎ మంత్రులు, మాజీ గవర్నర్లు, మాజీ కాంగ్రెస్‌ నాయకుల నుంచి కాల్స్‌ పరంపరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వెంకయ్య నాయుడు ఈ విధమైన ఒత్తిడి కొనసాగినట్లయితే తాను ఢిల్లీ నుంచి పారిపోతానని తన సన్నిహిత మిత్రులతో చెబుతున్నారని అంటున్నారు.

కాగా, ప్రస్తుతం బంగళాలలో ఉంటున్న వారందరూ ఈ నెల 18 లోగా ఖాళీ చేయాలని కోరుతూ మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది కూడా. లోక్‌సభ సెక్రటేరియట్‌ కూడా ఈ సందర్భంగా 265 మంది మాజీ ఎంపిలకు నోటీసులు పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+