సన్నీలియోన్‌లా ఆనందాన్నివ్వాలి: రాంగోపాల్ వర్మపై గోవాలో కేసు

ప్రపంచంలోని మహిళలందరూ పురుషులకు సన్నీ లియోన్‌(సినీ నటి) కలిగించేంత సంతోషం కలిగించాలని కోరుకొంటున్నానంటూ వర్మ ట్వీట్‌ చేశారు. కాగా, ఇవి వివక్షాపూరితమని నెటిజన్లు మండిపడ్డారు.

పనాజీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో వార్తల్లో ఉండాలని కోరుకునే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి అలాంటి పనే చేసి చిక్కుల్లో పడ్డారు. మహిలా దినోత్సవం సందర్భంగా 'ట్విట్టర్‌'లో వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రపంచంలోని మహిళలందరూ పురుషులకు సన్నీ లియోన్‌(సినీ నటి) కలిగించేంత సంతోషం కలిగించాలని కోరుకొంటున్నానంటూ వర్మ ట్వీట్‌ చేశారు. కాగా, ఇవి వివక్షాపూరితమని నెటిజన్లు మండిపడ్డారు.

ఇది ఇలావుంటే.. వర్మ ట్వీట్ వ్యాఖ్యలపై గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు దాఖలు చేశారు. ఇది దాఖలయ్యాక ఈ అంశంపై వర్మ ట్విట్టర్‌లో మరికొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Ram Gopal Varma Lands In Trouble; Complaint Filed Over His Sunny Leone Tweet

సన్నీ లియోన్‌ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తీకరిస్తున్నానని తెలిపారు. ఇలా వ్యక్తీకరించడంలో నిజాయతీగా ఉన్నందుకు తన తల్లి, సోదరి, కుమార్తె తనను గౌరవిస్తారని చెప్పారు.

అంతేగాక, 'పురుషులు అందరి తరఫున మ హిళలకు పురుషదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కనీసం ఈ రోజైనా మహిళలు మగవాళ్లను సాధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. పురుషులు ఇచ్చే స్వేచ్ఛను మహి ళలు ఇవ్వలేరు' అంటూ రాసుకొచ్చాడు. తనపై కేసు పెట్టిన వ్యక్తిపైనా చులకన చేస్తూ ట్వీట్లు చేశారు వర్మ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+