వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్‌పై గ్యాంగ్‌రేప్,హత్య: నలుగురు స్టూడెంట్స్‌కు జీవిత ఖైదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: విద్యాబుద్దులను నేర్పే టీచర్‌ను నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు పూర్వ విద్యార్థులకు జీవిత ఖైదు విధిస్తూ రామనగర జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పును విధించింది.

తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్‌నే నిందితులు నమ్మించి కిడ్నాప్ చేశారు. ఇంటి వద్ద దింపుతామని కారులో తీసుకెళ్ళి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు నలుగురు నిందితులు టీచర్‌ను హత్యచేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితులను పది రోజుల్లోనే అరెస్ట్ చేశారు. 2009 ఆగష్టు 2వ, తేదిన ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే ఈ దురాగతానికి పాల్పడింది స్కూల్ పూర్వ విధ్యార్థులేనని విషయం వెలుగు చూడడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

నమ్మించి టీచ‌ర్‌పై గ్యాంగ్ రేప్

నమ్మించి టీచ‌ర్‌పై గ్యాంగ్ రేప్

2009 ఆగస్టు 2న బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు(29) హత్యకు గురైంది. హత్యకు ముందు సామూహిక అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు.ఈ హత్యకు నలుగురు పూర్వ విద్యార్థులే కారణమని పోలీసులు గుర్తించారు.రవి, మంజునాథ్‌, రవీశ, నరసింహలు కలిసి టీచర్‌ను కారులో ఇంటివద్ద దింపుతామని కిడ్నాప్ చేశారు. ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్ళి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత టీచర్‌పై నగలను దోచుకొన్నారు. ఆమెను హత్య చేశారు.

పది రోజుల్లోనే నిందితుల అరెస్ట్

పది రోజుల్లోనే నిందితుల అరెస్ట్

ఈ కేసులో నిందితులను పది రోజుల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులు ఎక్కడి నుండి కారులో టీచర్‌ను తీసుకెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్ళారనే విషయాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తాము సేకరించిన సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులను అరెస్ట్ చేసి ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

ఎనిమిదేళ్ళ పాటు సాగిన విచారణ

ఎనిమిదేళ్ళ పాటు సాగిన విచారణ


ఈ కేసు విచారణ 8 ఏళ్ళ పాటు సాగింది. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ డిసెంబర్ 20వ, తేదిన తీర్పును వెలువరించింది.నిందితులను జీవితాంతం కారాగారంలో ఉంచాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

టీచర్‌పై దారుణానికి పాల్పడడం హేయం

టీచర్‌పై దారుణానికి పాల్పడడం హేయం

విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయురాలిపై ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం హేయమైన చర్య అని న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణ రై ఆందోళన వ్యక్తం చేశారు.నిందితులకు జీవిత ఖైదు సరైన శిక్ష అని కోర్టు అభిప్రాయపడింది.

English summary
Ramanagar court ordered to 4 accused life sentence on Wednesday. In a gruesome incident, a school teacher was kidnapped, gang raped and murdered by four persons on 20009 Aug 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X