ఈ 5 మీదగ్గరుంటే.. షుగరు రమ్మన్నా రాదు!
షుగరు వ్యాధి ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలిసిందే. ఒకసారి ఇది వచ్చిన తర్వాత మన జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అందుకనుగుణంగా మారలేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ 5 అలవాట్లు మనదగ్గరుంటే అసలు షుగరే మన దరిచేరదు. జన్యుపరమైన కారణాలవల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అయితే కొన్ని మన అలవాట్లు కూడా డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నాయి.
* మారుతున్న జీవనశైలితోపాటు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కూడా టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నాయి.

* నిత్యం మనం చేసే పనుల్లో కొంచెం మార్పులు చేసుకుంటే షుగరుకు దూరంగా జరగొచ్చు.
* ప్రతిరోజు వ్యాయామం చేయడంవల్ల డయాబెటిస్ తగ్గుతుంది. ఎందుకంటే కొవ్వు కరుగుతుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీనివల్ల రక్తంలో షుగరు అదుపులో ఉంటుంది.
* మన శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరం లేదు. అయితే పరిమితంగా తీసుకుంటుండాలి.
* పిండి పదార్ధాలను శరీరం చిన్న చక్కెర కణాలుగా మారుస్తుంది. ఇవి రక్తంలోకి ప్రవేశించి చక్కెర శాతాన్ని పెంచుతాయి.
* శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకుంటుండాలి.
* ప్యాక్ చేసిన తీపి రసాలు, పండ్ల రసాలకు దూరంగా ఉండాలి.
* అలాగే ప్యాక్ చేసిన సోడాను దూరం పెట్టాలి. వీటివల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
* క్రమం తప్పకుండా చేసే వ్యాయామం కూడా షుగరును దూరం పెడుతుంది.
* సిగరెట్లు, బీడీలు, హుక్కా , గంజాయి వంటి వాటికి బానిస కావొద్దు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది కూడా మధుమేహాన్ని పెంచుతుంది. * చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.












Click it and Unblock the Notifications