జియో బంపర్ ఆఫర్: ఆ ఫోన్లు కొనుగోలు చేస్తే 448 జీబీ డబుల్ డేటా

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై:రిలయన్స్ జియో మరో సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది. ప్రతిరోజూ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది.తాజాగా శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి జియో బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి జియో ప్రవేశించింది. ఉచితంగా ఆరుమాసాలపాటు డేటా, ఉచిత వాయిస్ కాల్స్ ను అందించింది రిలయన్స్ జియో.

ఏప్రిల్ నుండి తన టారిఫ్ ను ప్రకటించింది జియో. అయితే రిలయన్స్ ధనా ధన్ ఆఫర్ తో ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్త ఆఫర్లను ప్రకటించాయి. జియో ధీటుగా కొత్త ఆఫర్లను ఆయా కంపెనీలు ప్రకటించాయి.

జియో ప్రకటిస్తున్న ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థి టెలికం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏ రోజు ఏ ఆఫర్ తో జియో రానుందనే విషయమై ప్రత్యర్థి టెలికం కంపెనీలకు అంతుబట్టడం లేదు. జియో ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహంతో ముందుకువెళ్తోంది.

శ్యాంసంగ్ ఎస్ 8 ఫోన్లు కొనుగోలు చేస్తే జియో ఆఫర్

శ్యాంసంగ్ ఎస్ 8 ఫోన్లు కొనుగోలు చేస్తే జియో ఆఫర్

రిలయన్స్ జియో సంచలనాలకు తెరతీస్తోంది. కొత్త కొత్త ఆఫర్లతో జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.కొత్త గెలక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి జియో బంపర్ ఆపర్ ను ప్రకటించింది.జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది జియో.

8 నెలలపాటు 448 జీబీ డేటా

8 నెలలపాటు 448 జీబీ డేటా

కొత్తగా శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 448 జీబీ 4 జీ డేటాను 8 మాసాలపాటు ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది.

అయితే నెలకు రూ.309 లతో రీచార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది.ధనాధన్ ప్లాన్ కిందే ఈ ఆఫర్ ను తెచ్చింది. ప్రస్తుతం శాంసంగ్ కొత్త గెలాక్సీ కొనుగోలుదారులకు నెలకు వాడుకొనే డేటా డబుల్ కానుంది. నెలకు 56 జీబీ డేటా చొప్పున ఎనిమిది నెలలపాటు 448 జీబీ డేటాను వాడుకొనే అవకాశం పొందుతారు. అయితే, ఈ ఫోన్లను శాంసంగ్ బుదవారం నాడు లాంచ్ చేసింది.

డీటిహెచ్ రంగంలోకి జియో

డీటిహెచ్ రంగంలోకి జియో

రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. టెలికం రంగంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.అయితే జియో తాజాగా డీటీహెచ్ రంగంలోకి ప్రవేశించింది. రిలయన్స్ జియో మే మాసం నుండి డీటీహెచ్ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రిలయన్స్ జియో సెట్ టాప్ బాక్స్ లు సిద్దమయ్యాయని జియో ప్రకటించింది.

సెట్ టాప్ బాక్స్ ధరలిలా

సెట్ టాప్ బాక్స్ ధరలిలా

జియో సెట్ టాప్ బాక్స్ ను ఇంటర్నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించారు. జియో ఇప్పటికే ఈ సేవల నిమిత్తం ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్టు అధికారికంగా పేర్కొంది. రిలయన్స్ జియో డీటీహెచ్ ధరను రూ.1800 లుగా నిర్ణయించారు. డీటీహెచ్ బుకింగ్ ను ఈ మాసంలోనే ప్రారంభించనున్నారు. రూ.180 నెలకు అతి తక్కువ ప్లాన్ గా నిర్ణయించారు. జియో డీటీహెచ్ ను మే మాసంలో ప్రారంభించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Samsung Galaxy S8 and Galaxy S8+ have been launched in India carrying price tags of Rs. 57,900 and Rs. 64,900, respectively. Pre-orders for the two smartphones have begun, and Reliance Jio and Samsung have joined hands to provide a 'Double Data' offer to Jio users who buy the Galaxy S8 or Galaxy S8 plus.
Please Wait while comments are loading...