వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో దెబ్బకు ఎయిర్‌టెల్, ఐడియాకు నిద్రకరువు!: ఆఫర్లతో పోటాపోటీ

|
Google Oneindia TeluguNews

ముంబై: టెలికామ్ రంగంలో పెను సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో మిగతా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, ఐడియా తమ కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి.

'అతి తక్కువ ధరకు డేటా... ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీ'.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ రెండు మాటలు ఎయిర్‌టెల్, ఐడియాకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఈ రెండు కంపెనీలు ఆత్మరక్షణలో పడ్డాయి. డేటా ప్యాక్స్ రేట్లను ఇప్పటికే కొంతవరకు తగ్గించేశాయి.

అయినా కస్టమర్లు జియోకు మొగ్గు చూపుతారేమోనని ఐడియా సరికొత్త ఆఫర్‌కు తెరలేపింది. ఈ ఆఫర్ ప్రకారం, ఐడియా వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా సినిమాలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Reliance Jio says rivals showing no intent to resolve interconnection issues

కాగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండి, ఐడియా వినియోగదారులైతే ఈ అప్లికేషన్‌ను చెక్ చేసుకోవచ్చని ఐడియా ప్రతినిధులు సూచించారు. ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాక యూజర్లపై కొంత ఛార్జి విధించే అవకాశముందని సమాచారం.

ఈ యాప్‌లో వల్ల కలిగే ప్రయోజనాలు పరిశీలించినట్లయితే...

-ఆఫ్‌లైన్‌లో వీడియోలు, సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

-ఆటోలాగిన్ ఆప్షన్

-యూజర్లు తమకు నచ్చిన క్వాలిటీలో వీడియోలను ఎంపిక చేసుకోవచ్చు.

-యూజర్లు ఒకేసారి రెండు వీడియోలను చూసేందుకు వీలుగా డ్యుయల్
స్క్రీన్ అందుబాటులో ఉంటుంది.

కాగా, ఎయిర్ టెల్ తోపాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా జియో దెబ్బకు వినియోగదారులకు పలు కొత్త ఆఫర్లను అందించే పనిలో పడ్డాయి.

English summary
Reliance Jio Infocomm Ltd on Tuesday alleged that despite repeated reminders and meetings, Bharti Airtel Ltd, Vodafone India Ltd and Idea Cellular Ltd have not shown any real intent to resolve the issue of interconnection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X