వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వేళ ఆర్మీ కీలక నిర్ణయం- విశ్రాంత సైనిక డాక్టర్లకు పిలుపు- ప్రధానికి తెలిపిన సీడీఎస్‌

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న డాక్టర్లను రీకాల్‌ చేయాలని నిర్ణయించారు. వీరి సేవల్ని ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్ రావత్‌ ప్రధాని మోడీకి తెలిపారు.

Recommended Video

Oxygen Crisis : Centre Exempts Customs Duty on Vaccines, Oxygen For 3 Months || Oneindia Telugu

గత రెండేళ్లలో రిటైర్‌ అయిన మిలటరీ డాక్టర్లు తమ ఇంటికి సమీపంలో ఉన్న కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని జనరల్‌ బిపిన్ రావత్‌ ప్రధాని దృష్టికి తెచ్చారు. అలాగే మిలిటరీ పరిధిలో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లను అవసరమైన కోవిడ్ ఆస్పత్రులకు తరలించేందుకు కూడా సిద్గంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు రెండేళ్ల కంటే ముందే రిటైర్ అయిన మిలటరీ డాక్టర్లు సైతం ఆన్‌లైన్‌లో కోవిడ్ సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

Retired Military Medics Recalled To Work At Covid Facilities

ఢిల్లీలోని మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌లో నియామక వ్యవహారాలు చూస్తున్న సైనిక అధికారుల్ని సైతం కోవిడ్ సేవల్లో వాడుకునేందుకు ఆర్మీ అంగీకారం తెలిపింది. అలాగే నర్సింగ్‌ స్టాప్‌ కూడా డాక్టర్లకు సేవలు అందిస్తారని జనరల్ బిపిన్‌ రావత్‌ ప్రధానికి చెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు దేశంలో అవసరమైన చోట తాత్కాలిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా సైన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు భారత్‌లో, విదేశాలకు ఆక్సిజన్‌ సిలెండర్ల రాకపోకలకు ఎయిర్‌ఫోర్స్ చూపుతున్న చొరవపైనా ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
All medical personnel who retired from the armed forces in the last two years will be recalled and deployed at Covid facilities near their homes, Chief of Defence Staff (CDS) General Bipin Rawat told Prime Minister Narendra Modi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X