Revenge: బిర్యానీ హోటల్ ఓనర్ ను అదే హోటల్ ముందు ?, రౌడీకి భార్య ?, సీసీటీవీల్లో షాక్ !
చెన్నై: ఓ యువకుడు సిటీలో రౌడీలతో తిరుగుతూ అనేక దందాలకు పాల్పడ్డాడు. ఇతని మీద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ యువకుడికి వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. సొంతంగా బిర్యానీ మోటల్ నిర్వహిస్తున్న యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. మార్కెట్ ఏరియాలో అతని బిర్యానీ హోటల్ చాలా ఫేమస్. రాత్రి హోటల్ లో పనిచేసే వాళ్లు బిర్యానీ చేస్తుంటే హోటల్ బయటకు వచ్చిన హోటల్ యజమాని ఫ్రెండ్ ఆటోలో కుర్చుని సిగరేట్ తాగుతున్నాడు. ఆ సందర్బంలో హెల్మెట్ లు వేసుకుని మూడు బైక్ ల్లో వెళ్లిన వ్యక్తులు అందరి ముందు బిరినీ హోటల్ యజమానిని ఆటోలో నుంచి బయటు లాగి కత్తులు, వేటకొడవళ్లతో నరికి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. రౌడీని హత్య చెయ్యడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

చిన్న వయసులోనే రౌడీ కార్యకలాపాలు
చెన్నై సిటీలోని అరుంబాక్కంలోని ఆజాద్ నగర్ సమీపంలోని ఎంఎండీ కాలనీలో నాగూర్ రవి అలియాస్ రవి (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్న వయసులోనే చెన్నై సిటీలో రౌడీలతో తిరిగిన రవి దందాలకు, దౌర్జన్యాల పాల్పడ్డాడు. రవి మీద అరుంబాక్కం, సులకరై తదితర పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు
అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చిన నాగూర్ రవి తరువాత ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. రవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలు ఉన్నా రవి మాత్రం రౌడీయిజం చేస్తూనే ఉన్నాడు. అరుంబాక్కం ఏరియాలో రవి కొంత మందిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాల క్రితం రవిలో కొంచెం మార్పు వచ్చింది.

సొంతంగా బిర్యానీ హోటల్
అరుంబాక్కం మార్కెట్ ఏరియాలోని యునైటెడ్ ఇండియా నగర్ మెయిన్ రోడ్డులో కరీం బిర్యానీ హోటల్ ప్రారంభించిన రవి వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టాడు. అరుంబాక్కం మార్కెట్ ఏరియాలో నాగూర్ రవి బిర్యానీ హోటల్ చాలా ఫేమస్ అయ్యింది. రోజు బిర్యానీ హోటల్ లో వ్యాపారం చేస్తున్న రవి డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

హోటల్ ముందు సిగరేట్ తాగుతుంటే ?
రాత్రి 7 గంటల సమయంలో హోటల్ లో పనిచేసే వాళ్లు బిర్యానీ చేస్తుంటే హోటల్ బయటకు వచ్చిన హోటల్ యజమాని రవి హోటల్ ఎదురుగా ఫ్రెండ్ ఆటో పార్క్ చేసి ఉండటంతో అదే ఆటోలో కుర్చుని సిగరేట్ తాగుతున్నాడు. ఆ సందర్బంలో హెల్మెట్ లు వేసుకుని మూడు బైక్ ల్లో వెళ్లిన ఆరు మంది యువకులు బిరియానీ హోటల్ యజమాని రవిని ఆటోలో నుంచి బయటు లాగేశారు.

స్పాట్ లో నరికి చంపేశారు
ఆటోలో నుంచి ఇద్దరు రవిని బయటకు లాగడంతో మిగిలిన నలుగురు కత్తులు, వేటకొడవళ్లతో రవిని దారుణంగా నరికేశారు. ఒక్కసారిగా అందరూ కత్తులతో దాడి చెయ్యడంతో రవి అతని బిరియానీ హోటల్ ముందే స్పాట్ లో చనిపోయాడు. విషయం తెలుసుకున్న కీలంపాక్కం డీసీపీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

సీసీటీవీల్లో షాకింగ్ క్లిప్స్
రవి శవాన్ని స్లాల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిరియానీ హోటల్ యజమానిని అందరూ చూస్తున్న సమయంలో మార్కెట్ లోనే చంపేయడం కలకలం రేపింది. రౌడీ నాగూర్ రవిని హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు కావడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయ్యింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications