Revenge: అక్క మొగుడు, జీవితం నాశనం చేశాడని ? ఆఫీసులోనే దుమ్ములేపిన బావమరిది, జస్ట్ మిస్ !
బెంగళూరు: పెళ్లి వయసుకు వచ్చిన యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. ఐటీ హబ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. ఇద్దరి కులాలు ఒక్కటే కావడంతో పెళ్లి చెయ్యాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతి, యువకుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెద్దలు కూడా మాట్లాడుకుని పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు. వివాహం చేసుకున్న మహిళ అంటే ఆమె సొంత తమ్ముడికి చాలా ప్రేమ, అభిమానం, అక్కకు పెళ్లి అయిపోయినా ఆమె అంటే ప్రాణం ఇస్తున్నాడు.
వివాహం చేసుకున్న మూడు సంవత్సరాలు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. తరువాత దంపతుల మద్య గొడవలు జరిగాయి, పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది. దంపతులు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. కోర్టులో విడాకుల కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో మహిళ తమ్ముడు అతని బావ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా డ్రాగెన్ తో అతని బావను పొడిచి ఇనుప రాడ్లుతో దాడి చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో మంచి ఉద్యోగం
బెంగళూరులో నివాసం ఉంటున్న నాగేష్ అనే యువకుడు ఐటీ హబ్ లోని ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళిలో గౌతమి అనే యువతి నివాసం ఉంటున్నది. పెళ్లి వయసుకు వచ్చిన గౌతమికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక పెళ్లి సంబంధాలు చూశారు.

గ్రాండ్ గా పెళ్లి చేశారు
ఐటీ హబ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న నాగేష్ కు అతని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. నాగేష్, గౌతమిల కులాలు ఒక్కటే కావడంతో పెళ్లి చెయ్యాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. పెళ్లి చేసుకునే నాగేష్, గౌతమి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెద్దలు కూడా మాట్లాడుకుని 2017లో నాగేష్, గౌతమిల పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు.

అక్క అంటే తమ్ముడికి ప్రాణం
గౌతమికి గగన్ అనే తమ్ముడు ఉన్నాడు. వివాహం చేసుకున్న గౌతమి అంటే ఆమె సొంత తమ్ముడు గగన్ కు చాలా ప్రేమ, అభిమానం, అక్క గౌతమికి పెళ్లి అయిపోయినా ఆమె అంటే గగన్ ప్రాణం ఇస్తున్నాడు. వివాహం చేసుకున్న రెండు సంవత్సరాలు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. తరువాత దంపతుల మద్య గొడవలు జరిగాయి, పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

కోర్టులో విడాకుల కేసు
2019లో గౌతమి, నాగేష్ దంపతులు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. కోర్టులో వీళ్ల విడాకుల కేసు విచారణలో ఉంది. మా అక్క గౌతమి జీవితం నాశనం కావడానికి బావ నాగేష్ కారణం అని గగన్ కక్ష పెంచుకున్నాడు. బెంగళూరులోని రామమూర్తి నగర్ లో ఉంటున్న నాగేష్ అంతు చూడాలని గగన్ డిసైడ్ అయ్యాడు. బెంగళూరులోని రామమూర్తి నగర్ లోని బావ నాగేష్ ఆఫీసులోకి గగన్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా డ్రాగెన్ తో అతని బావ నాగేష్ ను పొడిచి ఇనుప రాడ్లుతో దాడి చెయ్యడం కలకలం రేపింది.

సీసీటీవీల్లో ?
తీవ్రగాయాలైన నాగేష్ ను బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బావ నాగేష్ మీద దాడి చేసిన గగన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. గగన్ అతని బావ నాగేష్ మీద దాడి చేస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని పోలీసులు అధికారులు తెలిపారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications