cinema style: డెలివరీ బాయ్స్ టీషర్టులతో రోడ్డు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంటాడి చంపేసి !
చెన్నై/కన్యాకుమారి: రియల్ ఎస్టేట్ వ్యాపారిని పక్కాప్లాన్ తో చంపడానికి ప్రత్యర్థులు స్కెచ్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బయలుదేరాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి డౌట్ రాకుండా ఓ ఫుడ్ డెలవరీ కంపెనీ టీషర్టులు వేసుకున్న ప్రత్యర్థులు అతని వాహనాన్ని వెంబడించారు. సినిమా స్క్రిప్ట్ లెవల్లో నడిరోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారిని నడిరోడ్డులో వెంటాడి వెంటాడి చంపేశారు. డౌట్ రాకుండా ఉండటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నేహితుడిని కత్తులతో పొడిచారు. నడి రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కరుంగల్ సమీపంలోని చెల్లగోణం ప్రాంతంలో జేవియర్ బాబు అలియాస్ జేవియ్ (57) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జేవియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. జేవియర్ అతని స్నేహితుడు మోహన్‌తో కలిసి నాగర్‌కోయిల్‌లోని ల రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కొని ఆస్తిపత్రాల పేపర్లు తీసుకుని బైక్ లో బయలుదేరాడు. మార్గం మధ్యలో మమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నారా అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జేవియర్ గమనించుకుంటూనే వెలుతున్నాడు,

జుమాటో డెలవరీ బాయ్స్ టీషర్టులు
జేవియర్ బాబు ను జుమాటో కంపెనీ టీషర్టులు వేసుకున్న కొందరు బైక్ ల్లో వెంబడించారు. మార్గం మధ్యలో జుమాటో టీషర్టులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు జేవియర్ వెలుతున్న బైక్ అడ్డగించారు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి జేవియర్, అతని ఫ్రెండ్ మోహన్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మా బైక్ ను ఢీకొట్టి నిలపకుండా వెలుతున్నావా అంటూ జుమాటో టీషర్టులు వేసుకున్న వాళ్లు జేవియర్, మోహన్ లతో గొడవ పెట్టుకున్నారు.

తప్పించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
అదే సమయంలో జేవియర్ ఏదో తప్పు జరిగిందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అయినా జుమాటో టీషర్టులు వేసుకున్న వాళ్లు ఆ ప్రాంతంలోని ఓ కల్యాణమండపం సమీపంలో జేవియర్ బైక్ ను అడ్డగించారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారితో వాగ్వాదానికి దిగారు. జుమాటో కంపెనీ డెలవరీ బాయ్ వేషంలో ఉన్న వ్యక్తులు బ్యాగ్ దాచిన కత్తి బయటకు తీసి జేవియర్, అతని ఫ్రెండ్ మోహన్ మీద దాడి చేశారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో ప్రాణభయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి జేవియర్, అతని ఫ్రెండ్ మోహన్ రోడ్డు మీద పరుగులు తీశారు.

వెంటాడి వెంటాడి చంపేశారు
జుమాటో టీ షర్టులు వేసుకున్న ప్రత్యర్థులు ఇద్దరినీ వెంబడించి దాడి చేశారు. వెంటాడి వెంటాడి కత్తులతో పొడవడంతో తీవ్రగాయాలైన రియల్ ఎస్టేట్ వ్యాపారి జేవియర్ బాబు అలియాస్ జేవియర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జేవియర్ స్నేహితుడు మోహన్ ప్రాణాలతో తప్పించుకుని పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న కొట్టార్ పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి జేవియర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు

సీసీటీవీ కెమెరాల్లో ?
తీవ్రంగా గాయపడిన మోహన్‌ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యపై కోటార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బయలుదేరే ముందు జేవియర్, అతని ఫ్రెండ్ మోహన్ ఎవరెవరికి ఫోన్లు చేశారు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టపగలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని టుమాటో టీషర్టులు వేసుకుని వచ్చిన ప్రత్యర్థులు అతన్ని రోడ్డు మీద తరిమి తరిమి కత్తులతో పొడిచి హత్య చెయ్యడం కన్యాకుమారి జిల్లాలో కలకలం రేపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications