అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ లీడర్, కళ్లల్లో కారం చల్లి వెంటాడి వెంటాడి లేపేశారు, శవాన్ని?
అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇక జడ్ పీటీసీ, పంచాయితీ, గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్బంలో గొడవలు జరిగితే గ్రామాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామాల్లో పార్టీ జెండాల కోసం గొడవలు జరిగితే తరువాత కుటుంబ గొడవలుగా మారిపోతుంటాయి.
ఎన్నికలు పూర్తి అయిన తరువాత అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల మీద దాడి చేశారని, వారిని హత్యలు చేశారని ఆరోపిస్తూ కేసులు పెట్టుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులే పదేపదే హత్యకు గురి కావడంతో సొంత పార్టీ నాయకులు హడలిపోతున్నారు. పార్టీలో సెకండ్ గ్రేడ్ లీడర్స్ హత్యలతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో రెండోసారి సిద్దరామయ్య సీఎం అయ్యారు. సిద్దరామయ్య సీఎం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాగా ఉంటారని అనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వరుస హత్యలకు గురి అవుతున్నారు. కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని ముండగి తాలుకాలోని డంబళ గ్రామంలో శరణప్ప సందీగౌడ్ర అలియాస్ శరణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మంచి పదవిలో ఉన్న శరణప్ప విద్యావంతుడు. డంబళ గ్రామం సమీపంలోని ఓ పొలంలో శరణప్ప చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. శరణప్పను హత్య చేసిన నిందితులు అతని గొంతుకు తాడుబిగించి చెట్టుకు వేలాడదీసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ నాయకుడు శరణప్పను అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.
శరణప్పను హత్య చెయ్యకముందు అతని మీద దాడి చేశారని, కళ్లల్లో కారం చల్లి అతని పొల్లాల్లో వెంటాడి వెంటాడి నరికి చంపేసి తరువాత శవాన్ని చెట్టుకు వేలాడదీశారని పోలీసు ఇన్స్ పెక్టర్ మంజునాథ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీల అమలు గురించి ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం జరుగుతున్న రోజే కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరణప్ప దారుణ హత్యకు గురి కావడం గదగ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శరణప్ప హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications