ప్రముఖ సినీ నటి రిసార్ట్ లో లవర్స్ ఎంజాయ్, మంచం కింద రూమ్ బాయ్, కట్ చేస్తే !
చెన్నై/ చెంగల్పట్టు: ప్రముఖ సినీ నటి వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. రొమాంటిక్ నటిగా పేరు తెచ్చుకున్న ఆ నటికి సినీ పరిశ్రమలో ఓ రైంజ్ లో పేరు ఉంది. నటి భర్త వ్యాపారం చేస్తున్నాడు. సముద్రం తీరంలో రిసార్ట్ నిర్మించిన నటి భర్త ఆ రిసార్టు గదులు అద్దెకు ఇస్తున్నాడు. ఇదే రిసార్ట్ లో లవర్స్ రూమ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. రిసార్ట్ లోని లవర్స్ ఉన్న రూమ్ లోని మంచం కింద రూమ్ బాయ్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.
తమిళ సినీ పరిశ్రమలో సంధ్యా రొమాంటిక్ నటిగా పేరు తెచ్చుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం సంధ్యా వెంకటేశన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. రొమాంటిక్ సినీ నటి సంధ్యా భర్త వెంకటేశన్ పెరల్ బీచ్ పేరుతో చెంగల్పట్టు జిల్లాలోని పరమంకేణి ప్రాంతంలో బీచ్ రిసార్ట్ నడుపుతున్నాడు. రిసార్టులతో పాటు నటి సంధ్యా భర్త వెంకటేశన్ కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడని సమాచారం.

ఈనెల 19వ తేదీ రాత్రి చెన్నైలోని కేకే నగర్ కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బీచ్ లోని నటి సంధ్యా భర్త వెంకటేశన్ కు చెందిన రిసార్టులోని గదిని బుక్ చేశాడు. అర్ధరాత్రి ప్రేమికులిద్దరూ గదిలో ఎంజాయ్ చేసి తరువాత నిద్రిస్తున్నారు. ఆ సమయంలో అదే బీచ్ రిసార్ట్‌లో రూమ్‌బాయ్‌గా పనిచేస్తున్న తమిళనాడులోని శిఖినంగుప్పంకు చెందిన సుభాష్ అనే యువకుడు ప్రేమికుల గది దగ్గరకు వెళ్లాడు.
సుభాష్ స్పేర్ కీతో గది తలుపులు తెరిచి ప్రేమికుల గదిలోకి వెళ్లారు. తరువాత లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి నిద్రిస్తున్న యువకుడి ప్రియురాలిపై రూమ్ బాయ్ సుభాష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమికుడు తనతో రొమాన్స్ చేస్తున్నాడని అనుకున్న యువతి చాలా సేపు సైలెంట్ గా ఉండిపోయింది. అయితే చివరికి అనుమానం వచ్చిన యువతి బెడ్ మీద నుంచి లేచి గదిలోని లైట్లు ఆన్ చేసింది. యువతి లేస్తున్న విషయం గమనించిన సుభాష్ మంచం కిందకు వెళ్లిపోయాడు.
అప్పటికే గాఢనిద్రలో ఉన్న ప్రియుడిని చూసి యువతి షాక్ కు గురైంది. తనతో ఇంత వరకు ఎవరు రొమాన్స్ చేశారు అంటూ ప్రియురాలు హడలిపోయింది. తన ప్రియుడు నిద్రిస్తున్న సమయంలో తనతో ఇంకా ఎవరో అసభ్యంగా ప్రవర్తించారు అనే అనుమానంతో ఆ గది చుట్టూ చూసింది. తరువాత ప్రియురాలికి అనుమానం రావడంతో మంచం కింద చూసింది.

తాము బస చేసిన రూమ్ మంచం కింద సుభాష్‌ను చూసి షాక్‌కు గురైన యువతి గట్టిగా కేకలు వేసింది. ప్రియురాలు కేకలు వేస్తున్న శబ్దం విన్న ప్రేమికుడు వెంటనే నిద్రలేచి మంచం కింద దాక్కొని ఉన్న రూమ్ బాయ్ సుభాస్‌ను బయటకు లాగి చితకబాదేశాడు. ప్రేమికులతో పాటు అదే రిసార్టుకు వెళ్లిన వాళ్లు స్నేహితులు ఆ రూమ్ దగ్గరకు చేరుకున్నారు.
అదే రిసార్ట్‌లో ఉంటున్న యువకుడి స్నేహితులు కూడా అక్కడికి వెళ్లి రూమ్ బాయ్ సుభాష్‌ను పట్టుకుని చితకబాదేసి కౌవత్తూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ప్రియుడు, అతని స్నేహితుల దాడిలో గాయపడిన సుభాష్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
నటి సంధ్యా భర్త వెంకటేశన్ కు చెందిన రిసార్టులో పని చేసే రూమ్ బాయ్ సుభాష్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే బీచ్ రిసార్ట్‌లో బస చేసిన వివిధ మహిళల సన్నిహిత వీడియోలు కూడా బయటపడ్డాయని పోలీసులు అన్నారు. దీంతో పోలీసులు సుభాష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బీచ్ రిసార్ట్‌లో ప్రియుడితో కలిసి ఉంటున్న యువతిపై ఓ రూమ్‌బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డటం చెంగల్పట్టుతో పాటు చెన్నైలో కూడా కలకలం రేపింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications