"ఆర్ఆర్ఆర్" కు అవార్డుల పంట.. అరుదైన అకాడమీ అవార్డు దక్కించుకున్న రాజమౌళి సినిమా!!
'ఆర్ఆర్ఆర్' తెలుగు నాట మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమా "ఆర్ఆర్ఆర్". దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు ఇనుమడింపజేసిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అవార్డు
దేశ విదేశాలలో ఎంతో విశిష్ట ఖ్యాతిని ఆర్జించింది రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్. ఇక అటువంటి "ఆర్ఆర్ఆర్" తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో "ఆర్ఆర్ఆర్" అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న అవతార్ ద వే ఆఫ్ వాటర్, టాప్ గన్ మావెరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి, రాజమౌళి దర్శకత్వ వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతం సృష్టించింది.

అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో "ఆర్ఆర్ఆర్" అవార్డు
అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో "ఆర్ఆర్ఆర్" అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. జపాన్ దేశంలో ఈ చిత్రాన్ని నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. గతేడాది జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్రహ్మాండంగా ప్రదర్శితం అవుతుంది. జపాన్ లో విడుదల అయ్యి మూడు నెలలు గడిచినా ప్రజలు ఇంకా ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు అంటే సినిమాకి ఉన్న క్రేజ్ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్... నామినేషన్లపై ఉత్కంఠ
తెలుగు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడమే కాకుండా, సంచలనాల దిశగా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉన్నట్టుగా కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో మొత్తం 10 భారతీయ చిత్రాలు ఆస్కార్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇక నేడు ఆస్కార్ నామినేషన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఆస్కార్ జాబితాలో ఆర్ ఆర్ఆర్ ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications